1985లో విడుదలైన ఇద్దరు మిత్రులు చిత్రంలో కథానాయికగా పరిచయమైన రమ్యకృష్ణ ఆ తర్వాత సూత్రధారులు చిత్రంలో అద్భుతంగా నటించింది. అయితే ఈ రెండు సినిమాలు ఆమెకు నటీమణి గా ఎటువంటి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. 1992 లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడు గారు చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సరసన హీరోయిన్ గా నటించిన రమ్యకృష్ణ కు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాల్లో నటించిన రమ్య కృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అగ్ర తారగా పేరు సంపాదించింది.


అల్లరి ప్రియుడు సినిమా లో ద్వితీయ హీరోయిన్ గా నటించిన రమ్య కృష్ణ తన అందచందాలతో అభినయంతో ప్రేక్షకుల చేత వావ్ అనిపించింది. ఈ సినిమా మ్యూజికల్ హిట్ తో పాటు కథ కూడా బాగుండడంతో అన్ని రకాల హిట్ అందుకుంది. దాంతో ఆమె ఖ్యాతి గగనానికి ఎగిసింది. కె.రాఘవేంద్రరావు రమ్యకృష్ణ చేత శృంగార భరితమైన సన్నివేశాల్లో కూడా నటింపజేసాడు. 1994 వ సంవత్సరంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ముద్దుల ప్రియుడు సినిమాలో రమ్యకృష్ణ కథానాయకి పాత్రలో నటించింది. కె.రాఘవేంద్రరావు రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 


కె.రాఘవేంద్రరావు కారణంగానే రామకృష్ణ తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అని చెప్పుకోవచ్చు. అలాగే ఆమెలో నటనా ప్రతిభ అద్భుతంగా ఉండడంతో తెలుగు ప్రేక్షకులందరూ తన ని బాగా ఆదరించారు. బాహుబలి సినిమాలో శివగామి పాత్ర లో నిజంగా మహారాణిలా కనిపించిన రమ్యకృష్ణ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. గాడితప్పిన ఆమె సినీ కెరియర్ ని మళ్ళీ గాడిలో పెట్టాడు రాజమౌళి. ప్రస్తుతం ఆమె పలు సినిమాలలో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ సినీ బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: