దర్శకులకు కొంతమంది హీరోయిన్లు లక్కీగా మారతారు. దర్శకుడి విజన్ అర్ధం చేసుకునే విధానం, సెట్లో నడుచుకునే తీరు, కథను అవగాహన చేసుకోవడం, నటనలో పరిణితి చూపించడం.. వంటి అంశాలతో హీరోయిన్లు కొందరు దర్శకులకు ఫేవరేట్స్ గా మారతారు. తమ తర్వాతి సినిమాల్లో వారినే కంటిన్యూ చేయడానికి దర్శకులు ఇష్టపడుతూ ఉంటారు. హీరోలను కూడా ఈ విషయంలో ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు. టాలీవుడ్ లో ఓ దర్శకుడికీ, హీరోయిన్ కు మధ్య వృత్తిపరంగా ఒకరి మీద మరొక నమ్మకున్న వాళ్లలో దర్శకుడు తేజ, హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఉంటారు.

IHG

 

కల్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో 2007లో వచ్చిన లక్ష్మీ కల్యాణం సినిమా వచ్చింది. ఈ సినిమాతో కాజల్ ను తెలుగు తెరకు పరిచయం చేశాడు తేజ. ఆ సినిమాతో తేజకు కాజల్ నటనపై, తన టాలెంట్ పై నమ్మకం కుదిరింది. తర్వాత చాలా ఏళ్ల తర్వాత తేజ దర్శకత్వం వహించిన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కాజల్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా హిట్ అయింది. తర్వాత తేజ దర్శకత్వం వహించిన మరో సినిమా సీతసినిమాలో కూడా కాజల్ నటించింది. ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

IHG

  

కాజల్ లో ఉన్న కమిట్ మెంట్ చాలా గొప్పది. తొలి సినిమా అవకాశం ఇచ్చానని ఆమెకు నాపై గౌరవం ఉంది. నా సినిమాలో హీరోయిన్ గా చేయాలి అంటే.. కథ కూడా అడగకుండా ఓకే చెప్పే హీరోయిన్ కాజల్ మాత్రమే. ఇండస్ట్రీలో నమ్మకం, గౌరవం ముఖ్యం. ఇవన్నీ కాజల్ లో ఉన్నాయిఅని కాజల్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు తేజ. కాజల్ అగర్వాల్ లోని ఈ కమిట్ మెంటే ఆమెను టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ను చేసింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: