దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.. తన సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ ను సృష్టించారు అనే చెప్పాలి. కమర్షియల్ హంగులు అద్దుకున్న  తెలుగు చిత్ర పరిశ్రమకు.. ఎన్నో సొగబులు అద్ది  దృశ్య కావ్యాలు ప్రేమ కథలను తెరకెక్కించే ప్రేక్షకులు సినిమాలు చూసే పంథాను  కూడా మార్చారు కె.రాఘవేంద్రరావు. ముఖ్యంగా తన సినిమాల్లో హీరోయిన్లను అందాల దేవత గా చూపించడంలో విజయం సాధించారనే చెప్పాలి. కెమెరా ఏ  యాంగిల్ లో పెడితే హీరోయిన్ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అన్నది కె.రాఘవేంద్రరావు కు తెలిసినంతగా ఏ దర్శకుడికి తెలియదు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఎంతో మంది హీరోయిన్లతో రాఘవేంద్రరావు సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. 

 


 కాగా రాఘవేంద్రరావు విజయంలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ ఎవరూ అంటే మాత్రం అందరికీ టక్కున గుర్తొచ్చేది శ్రీదేవి. శ్రీదేవి రాఘవేంద్రరావు కాంబినేషన్లో అప్పట్లో ప్రేక్షకులందరికీ ఫేవరేట్ గా ఉండేది  అన్న విషయం. ఇక శ్రీదేవి నాటితరం హీరోలతో పాటు మొన్నటి తరం  హీరోల వరకు కూడా అందరితో నటించింది. కృష్ణ ఎన్టీఆర్ ఏఎన్నార్ లతోపాటు వెంకటేష్ చిరంజీవి ల సినిమాల్లో నటించింది శ్రీదేవి. అయితే దాదాపుగా శ్రీదేవి నటించిన చాలా సినిమాలకి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించినవే  కావడం గమనార్హం. ముఖ్యంగా తన సినిమాలలో శ్రీదేవిని ప్రేక్షకులకు అందాల దేవత గా... దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యగా చూపించడంలో దర్శకుడు కె.రాఘవేంద్రరావు విజయం సాధించాడు. 

 

 శ్రీదేవి కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. ముఖ్యంగా చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్గా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమా రాఘవేంద్ర రావు ను దర్శకుడిగా మరో మెట్టు పైన కి తీసుకెళ్ళింది అనడంలో అతిశయోక్తి లేదు. సినిమాలో ఒక అందాల దేవత గా దేవకన్యగా అతిలోకసుందరిగా శ్రీదేవి ని చూపించడం లో విజయం సాధించారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. ఇక దర్శకేంద్రుడు సినిమాలలో ఎక్కువ సార్లు రిపీట్ అయిన హీరోయిన్లలో శ్రీదేవి కూడా ప్రధమ స్థానంలో ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: