ఒకప్పుడు టెలివిజన్ రంగంలో ఎన్నో కామెడీ సీరియల్స్ వచ్చాయి.. కానీ అందులో చెప్పుకోదగ్గ సీరియల్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా ‘అమృతం’.. ఈ సిరియల్ అప్పట్లో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొదట శివాజీ, గుండు హనుమంత రావు ఉంటే.. హర్షవర్థన్, గుండ హనుమంత రావు కాంబినేషన్ వచ్చింది.  ఇలా మార్పులు చేర్పులతో ‘అమృతం’ సీరియల్ అంటే తెలుగు ప్రేక్షకును టివి ముందు కూర్చోబెట్టేలా చేశాయి.  అయితే అమృతం సీరియల్ ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాక.. దీని కొనసాగింపు ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు తలెత్తాయి. అదే సమయంలో గుండు హనుమంత రావు కన్నుమూయడం జరిగింది. అమృతం సీరియల్‌ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో  ఎంతలా నిలిచిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

సరదాసరదా సన్నివేశాలతో సాగే ఈ సీరియల్‌ తెలుగు రాష్ర్టాల్లో చాలా పాపులర్‌ అయింది. అయితే తాజాగా అమృతం మరోసారి ప్రేక్షకులను పలుకరించేందుకు ముస్తాబవుతుంది.  నటులు హర్షవర్ధన్‌ అమృతంగా, ఎల్బీ శ్రీరామ్ అంజిగా 'అమృతం ద్వితీయం' ఉగాదికి జీ5 ఓటీటీ వేదికగా విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మరోసారి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు కరోనా 'లాక్‌డౌన్'‌ స్పెషల్‌ పేరుతో రెండు ప్రత్యేక ఎపిసోడ్‌లను తీశారు.  

 

ఇక గుండు హనుమంత రావు స్థానంలో ఎల్బీ శ్రీరామ్ ఎంట్రీ ఇవ్వడంతో కొత్త తరహాలో కామెడీ కొనసాగబోతున్నట్లు అర్థం అవుతుంది.  ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఎల్బీ శ్రీరాం మాట్లాడారు. 'గాడ్'తో పాటు 'అమృతం' వంటి ప్రాజెక్టులలో నటించే అవకాశం తనకు లభించడం పట్ల గర్వంగా ఉందని చెప్పారు.  సీనియర్ నటుడు ఎల్బీశ్రీరామ్‌తోపాటు అమృతం సందడి చేసిన నటులు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుని స్పెషల్‌ ఎపిసోడ్స్‌ చిత్రీకరించారు. సరదాసరదా సన్నివేశాలతో సాగే ఈ సీరియల్‌ తెలుగు రాష్ట్రాల్లో ఎంత వరకు అలరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: