దర్శకుడు బోయపాటి తెరకెక్కించే సినిమాలు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే  విధంగా ఉంటాయి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒక హీరోలోని మాస్ ఎలిమెంట్స్ ని ప్రేక్షకులు కోరుకునే విధంగా చూపించడం... ఒక బోయపాటి కే సాధ్యం అవుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా బోయపాటి సినిమాలలో హీరో లు యాక్షన్ తో అదరగొడతారు..  అలాగే హీరోయిన్ లు  కూడా తమ హాట్ హాట్ అందాలతో అందరిని మెస్మరైజ్  చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బోయపాటి సినిమాల్లో  యాక్షన్ ఎలిమెంట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. ఇక ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు బోయపాటి. అయితే బోయపాటి శ్రీను తన సినిమాలలో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లను తీసుకు వస్తూ ఉంటారు.. 

 

 ఇక బోయపాటి ఇప్పటివరకు ఎక్కువ సార్లు రిపీట్ చేసిన  హీరోయిన్ లు  మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలా ఎక్కువ సార్లు రిపీట్ చేసిన హీరోయిన్లలో ఒకరు నయనతార. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన నయనతార ఎంత క్రేజ్ సంపాదించిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో స్టార్ హీరోల సినిమాలు అన్నింటికీ నయనతార కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే అటు  బోయపాటి కూడా నయనతారను తాను తెరకెక్కించిన రెండు మూడు సినిమాల్లో రిపీట్ చేశాడు. ఇక సినిమాల్లో తన అందం అభినయంతో ఆకట్టుకుంది  నయనతార . 

 


 ముఖ్యంగా బోయపాటి శ్రీను నయనతార కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం లక్ష్మి. లక్ష్మీ సినిమాలో  వెంకటేష్ కి జోడిగా నయనతార కనిపిస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ తనదైన యాక్షన్ సన్నివేశాలతో అద్భుతంగా అదరగొడితే...  అదే సమయంలో నయనతార తన అందం అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా మంచి విషయం కూడా సాధించింది. ఆ తర్వాత తులసి సినిమాలో కూడా నయనతార మరోసారి రిపీట్ అయింది. ఈ సినిమాలో కూడా నయనతార బోయపాటికి ఫేవరెట్ హీరోయిన్ గా మారి పోవడం తో ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సింహా సినిమాలో కూడా నయనతార హీరోయిన్ గా నటించింది. ఇలా బోయపాటి దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్  నయన తార నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: