తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకరత్న దాసరి నారాయణ రావు కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఒక గొప్ప దర్శకుడిగా ఎంతో మంది దర్శకులకు ఆదర్శంగా నిలిచారు దాసరి నారాయణరావు. ఎంతో మంది హీరోయిన్ లను  స్టార్ హీరోయిన్గా మార్చడమే కాదు ఎంతో మంది హీరోలను కూడా స్టార్ హీరో రేంజ్ తీసుకొచ్చారు దాసరి నారాయణరావు. ఇక ఆయనలో కేవలం దర్శకుడు మాత్రమే కాదు ఒక గొప్ప నటుడి కూడా తెలుగు ప్రేక్షకులు ఆస్వాదించారు. ఇక దాసరి నారాయణరావు తన సినిమాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించారు అని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో దాసరి నారాయణరావు ఎంతో మంది హీరోలతో ఎంతో మంది హీరోయిన్లతో సినిమాలలో తెరకెక్కించిన  విషయం తెలిసిందే. 

 

 అయితే దాసరి నారాయణరావు ఎంతో మంది హీరోయిన్లతో సినిమాలు తెరకెక్కించినప్పటికీ... దాసరి నారాయణరావుతో ఎక్కువగా ప్రేక్షకులకు ఫేవరెట్ గా మారిపోయిన హీరోయిన్ మాత్రం విజయశాంతి అని చెప్పాలి. విజయశాంతి తో దాసరి నారాయణరావు ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. ఎన్నో  లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు...  ప్రేమ కథ చిత్రాలు ఫ్యామిలీ కథా చిత్రాలను కూడా తెరకెక్కించారు దాసరి నారాయణరావు. ముఖ్యంగా దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఒసేయ్ రాములమ్మ సినిమా అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ కొత్త సంచలనానికి తెర లేపింది. 

 


 లేడీ ఓరియంటెడ్ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో రాములమ్మ పాత్రలో  విజయశాంతి నటించింది . ఇక విజయశాంతికి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ ని  చేసిన సినిమా కూడా ఇదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే విజయశాంతి దాసరి నారాయణరావు కాంబినేషన్లో  మరికొన్ని సినిమాలు కూడా వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. అందుకే దాసరి నారాయణరావు విజయశాంతి కాంబినేషన్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఫేవరేట్  మారిపోతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: