భారతదేశంలో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలోనే నెలల పాటు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ సిటీ లో బుల్లితెర వెండితెర షూటింగులు ఎన్నో జరుగుతుంటాయి. కరోనా మహమ్మారి కారణంగా చిత్రీకరణలన్నిటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశాయి. దాంతో కొన్ని వందల సినిమాలు, సీరియల్స్, ప్రోగ్రాంల షూటింగులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. రెండు నెలలకు పైగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో చిత్ర షూటింగు పున ప్రారంభించు కునేందుకు సినీ నిర్మాతలు దర్శకులు బడా హీరోలు అందరూ కలిసి కేసీఆర్ తో చర్చలు జరపగా... షూటింగులో తీసుకోవచ్చని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చాడు. సో, అతి త్వరలోనే అన్ని చిత్రాల షూటింగులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. 


వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కేవలం 30 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అది కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రించాల్సి ఉంది. 30 రోజుల షూటింగ్ పూర్తి చేస్తే ఒక పనైపోతుంది అని ఆ సినిమా నిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడట. అందుకే పవన్ కళ్యాణ్ ను సంప్రదించి... పవన్ గారు 30 రోజుల పాటు మీ డేట్స్ మాకు మాత్రమే కేటాయించండి. సినిమా త్వరగా పూర్తి చేద్దాం', అని విజ్ఞప్తి చేశారట. 


దాంతో వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ దిల్ రాజు విజ్ఞప్తిని అంగీకరించి తన డేట్స్ ఇచ్చాడట. అయితే దిల్ రాజు జూన్ మధ్య భాగంలో మిగిలిన షూటింగ్ ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది. పోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతిహాసన్ నటిస్తోందని సమాచారం. నివేదా థామస్, అంజలి, అనన్య కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండగా... వకీల్ సాబ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: