మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా సుబ్బు డైరక్షన్ లో వస్తున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్. భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి తేజ్ సరసన నాభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుండి మొదటి సింగిల్ నో పెళ్లి సాంగ్ రిలీజ్ చేశారు. లాక్ డౌన్ లో ఎలాంటి సినిమా సందడి లేని ఆడియెన్స్ కు ఈ సాంగ్ తో కిక్ ఇచ్చాడు సాయి తేజ్. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ క్యాచీగా ఉంది. ఇక నో పెళ్లి అంటూ సాయి తేజ్ పెళ్లిపై తన అభిప్రాయాన్ని చెబుతుంటాడు. 


అయితే సర్ ప్రయిజ్ ఏంటంటే ఈ సాంగ్ లో సాయి తేజ్ తో పాటుగా వరుణ్ తేజ్, రానాలు కూడా కనిపించి అలరించారు. ప్రమోషనల్ సాంగ్ గా వచ్చిన ఈ సాంగ్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దగ్గుబాటి వారసుడు రానా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. యష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ కంపోజింగ్ జరిగింది. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లు లేని సాయి తేజ్ లాస్ట్ ఇయర్ చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే సినిమాలతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమాతో కూడా సాయి తేజ్ హిట్టు కొట్టేలా ఉన్నాడని చెప్పొచ్చు. 


సినిమా సాంగ్ నుండే వెరైటీగా ప్రమోట్ చేస్తున్న సోలో బ్రతుకే టీం సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే తో కూడా ఆడియెన్స్ ను మెప్పిస్తారని తెలుస్తుంది. లాక్ డౌన్ లేకపోతే సమ్మర్ రిలీజ్ చేయాల్సిన ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత సాయి తేజ్ దేవా కట్ట డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ముహూర్త కార్యక్రమం పూర్తి కాగా త్వరలో షూటింగ్ మొదలు పెట్టనున్నారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: