డైరక్టర్ రాసుకున్న పాత్రకు తగినట్టుగా హీరోయిన్ దొరికితే బహుశా ఈ పాత్ర ఇలానే ఉంటుందేమో అనేలా ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. ఒక డైరక్టర్ తన టెస్ట్ కు తగినట్టుగా ఫలానా హీరోయిన్ మాత్రమే కావాలని పట్టుబడతాడు. కొందరు స్టార్స్ ను హీరోయిన్స్ గా తీసుకుం టే మరికొందరు తమ సినిమాలతోనే స్టార్స్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రత్నమే చేసి హీరోయిన్ గా తెలుగులో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది జెనీలియా. హ.. హ.. హాసిని పాత్రలో అదిరిపోయేలా చేసింది జెనీలియా. 

 

సిద్ధార్థ్ సరసన నటించిన బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా అద్భుతమైన నటనతో మెప్పించింది. తెలుగులో అప్పటికే సత్తా చాటిన జెనీలియాబొమ్మరిల్లు సినిమాతో సత్తా చాటింది. డైరక్టర్, హీరోయిన్ కాంబినేషన్ గురించి ప్రస్తావిస్తే తప్పకుండా బొమ్మరిల్లు భాస్కర్, జెనీలియా కాంబో గురించి మాట్లాడుకోవాల్సిందే. అంతేకాదు జెనీలియా ఈ సినిమా తర్వాత హాసిని అని పిలవడం మొదలుపెట్టారు. బొమ్మరిల్లు తర్వాత భాస్కర్ డైరక్షన్ లో వచ్చిన ఆరెంజ్ సినిమాలో కూడా నటించింది జెనిలియా. 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో జెనీలియా పాత్ర చాల ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమా ఫలితం నిరాశపరచినా సరే జెనీలియా మాత్రం తన క్యూట్ యాక్టింగ్ తో మెప్పించింది. బొమ్మరిల్లు భాస్కర్ మరోసారి జెనీలియానే బాగా వాడుకున్నాడు. నా ఇష్టం తర్వాత తెలుగులో నటించడం ఆపేసిన జెనీలియా ఆ తర్వాత రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్ళాడి సినిమాలకు దూరమైంది. మళ్ళీ చిరు సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది జెనీలియా. అదే జరిగితే మాత్రం తెలుగులో ఆమెని అభిమానించే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. హీరోయిన్ గా కాకున్నా క్యారక్టర్ ఆరిస్ట్ గా నటించాలని అనుకుంటుంది జెనీలియా. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: