ప్రస్తుతం బుల్లితెపై జబర్ధస్త్ కామెడీ షో ఎంతగా అలరిస్తుందో.. ఒకప్పుడు అమృతం సీరియస్ అంతగొప్పగా అలరించేది.  ఈ సీరియస్ వస్తుందంటే చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ టివి ముందు కూర్చునేవారు.  ఈ సీరియల్ పూర్తయ్యింది.. అంతలోనే గుండు హనుమంత రావు కన్నుమూశారు.  మరి ఈ సీరియల్ కంటిన్యూ అవతుందా అన్న అనుమానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు అమృతం ద్వితీయం సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుక రాబోతుంది. గుండు హనుమంత రావు బదులుగా ఎల్బీ శ్రీరామ్ ని తీసుకున్నారు.

 

లాక్‌డౌన్‌ సమయంలోనూ ప్రజలకు వినోదం అందిస్తున్న ఓటీటీలో అగ్రగామి సంస్థ ‘జీ 5’. ఫీచర్‌ ఫిల్మ్స్‌ డిజిటల్‌ రిలీజులకు శ్రీకారం చుట్టిందీ సంస్థ. ‘జీ 5’లో ‘అమృతరామమ్‌’ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్న ‘అమృతం ద్వితీయం’ నుండి రెండు లాక్‌డౌన్‌ స్పెషల్‌ ఎపిసోడ్స్‌ను మే 27న ‘జీ 5’లో విడుదల చేయనున్నారు. స్పెషల్‌ ఎపిసోడ్‌ కోసం స్పెషల్‌గా చేసిన టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. జూన్ 25 నుండి ప్రతి నెల రెగ్యులర్ 'అమృతం ద్వితీయం' ఎపిసోడ్స్ టెలికాస్ట్ కానున్నాయి. ఈ సందర్భంగా ‘అమృతం ద్వితీయం’ టీమ్‌, ‘జీ 5’ క్రియేటివ్‌ హెడ్‌ ప్రసాద్‌ నిమ్మకాయల వెబినార్‌లో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు.

 

ఈ సంద‌ర్భంగా ‘అమృతం ద్వితీయం’ దర్శకుడు సందీప్‌ గుణ్ణం మాట్లాడుతూ ‘‘నేను ‘అమృతం–2’ కోసం తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే... రచయితగా గుణ్ణం గంగరాజుగారిని (నిర్మాత కూడా ఆయనే), అమృతం ప్రాతకు హర్షవర్ధన్‌ని, అప్పాజీ పాత్రకు శివన్నారాయణగారి, సర్వం పాత్రకు వాసుని తీసుకున్నా. ‘ఈయన బాగా చేయడం లేదు’ అనలేకుండా, అద్భుతంగా చేసే ఎల్బీ శ్రీరామ్‌గారిని అంజి పాత్రకు తీసుకున్నా.ప్రస్తుతానికి నెలకు మూడు ఎపిసోడ్స్‌ లైవ్‌ చేయాలని అనుకుంటున్నాం. ‘అమృతం’లో కరెంట్‌ ఇష్యూస్‌ మీద చేశాం. అలాగే, ‘అమృతం–2’లోనూ చేస్తాం. అందుకని, ముందే అన్నీ షూటింగ్‌ చేయడం కన్నా ఎప్పటికప్పుడు చేయాలని అనుకున్నాం.

 

ప్రస్తుతం షూటింగ్‌ చేసిన ఎపిసోడ్స్‌ మూడు ఉన్నాయి. ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు స్టార్ట్‌ చేశాం.  ఇందులో 24 ఎపిసోడ్స్‌ ఉన్నాయి. మూడు ఎపిసోడ్స్‌ లైవ్‌ అయ్యాయి. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత మిగతా ఎపిసోడ్స్‌ లైవ్‌ చేస్తాం. లాక్‌డౌన్‌ స్పెషల్స్‌ అని 10, 8 నిమిషాల నిడివి గల రెండు స్పెషల్‌ ఎపిసోడ్స్‌ చేశాం. వాసు స్ర్కిప్ట్‌ రాశాడు. నాన్న (గుణ్ణం గంగరాజు) చదివారు. నటీనటులకు ఏం చేయాలో వివరించాను. ఎవరింట్లో వాళ్లు షూటింగ్‌ చేసి పంపారు. ఈ సీజన్‌లో హర్షవర్ధన్‌ రెండు ఎపిసోడ్స్‌ డైరెక్ట్‌ చేశాడు" అన్నారు.

 

‘జీ 5’ క్రియేటివ్‌ హెడ్‌ ప్రసాద్‌ నిమ్మకాయల మాట్లాడుతూ ‘‘నేను మొదట ‘అమృతం’ సీరియల్‌గా అభిమానిని. నేను ‘జీ 5’లో జాయిన్‌ అయిన తర్వాత మా సీఈవో తరుణ్‌గారు ఇచ్చిన ఛాలెంజ్‌ ఏంటంటే... ‘నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మళ్లీ అమృతం తీసుకురావలి’ అన్నారు. గంగరాజుగారు కన్విస్‌ చేయడం సాగరమథనం. ‘అమృతం–2’ స్ట్రీమింగ్‌ చేసేవరకూ ఎప్పుడు చేస్తారని ఆడియన్స్‌ అడిగారు. చేసిన తర్వాత ఆపినందుకు ఇప్పుడు అడుగుతున్నారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, మీడియా, పోలీసు విభాగాలు లాక్‌డౌన్‌ సమయంలో చాలా కష్టపడి పని చేశాయి. వాళ్లకు లాక్‌డౌన్‌ స్పెషల్‌ ఎపిసోడ్స్‌ అంకితం ఇస్తున్నాం. ఉగాది రోజున విడుదలైన 'అమృతం ద్వితీయం'కి చాలా మంచి స్పందన లభించింది ’’ అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: