టివి ఆన్ చేస్తే చాలు ఏదో ఒక ఛానెల్ లోనో.. ఈవెంట్ లోనో కనిపించే సుమ కేవలం బుల్లితెరకు మాత్రమే పరిచయం అయ్యింది. అఫ్కోర్స్ అక్కడ ఆమెకు చేతినిండా పని అనుకోండి. దాదాపు రెండు దశాబ్దాలుగా బుల్లితెర మీద సందడి చేస్తున్న సుమ వెండితెర మీద మాత్రం నటించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పుడప్పుడు ఏదో అలా వచ్చి ఇలా వెళ్లే పాత్రలే సినిమాల్లో చేసిన సుమ ఇప్పుడు కొద్దిగా ఇంపార్టెంట్ రోల్ చేసేందుకు రెడీ అవుతుందట. అదికూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చే పుష్ప సినిమాలో సుమ నటిస్తుందని తెలుస్తుంది. 


పుష్ప సినిమాలో మంచి స్కోప్ ఉన్న పాత్రలో సుమ నటిస్తుందని అంటున్నారు. సుమ కూడా కొన్నాళ్లుగా సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు అవకాశం రాగానే ఓకే చెప్పిందని అంటున్నారు. ఇప్పటికి స్మాల్ స్క్రీన్ పై తన సత్తా చాటుతున్న సుమ వరుస ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటుంది. ఇలాంటి టైం లో ఆమెను ఒప్పించి మరి పుష్ప సినిమాలో తీసుకున్నారట సుకుమార్. 


తప్పకుండా ఈ సినిమాతో సుమ మళ్ళీ వరుస సినిమాలు చేసేలా తన సత్తా చాటుతుందని అంటున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ క్రేజీ లుక్ సినిమాపై అంచనాలు పెంచింది. కేరళ అడవుల్లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో మళ్ళీ సెట్స్ మీదకు వెళ్లనుంది. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో యాంకర్ అనసూయ కూడా నటిస్తుందని అంటున్నారు. సుమతో పాటు యాంకర్ అనసూయ కూడా ఈ సినిమాలో నటిస్తుందని టాక్. మరి సుక్కు, బన్నీ ప్లాన్ ఏంటో గాని సినిమా మాత్రం అదిరిపోవడం ఖాయమని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: