మనం ఎన్ని సినిమాలు చుసిన అందులో ఖచ్చితంగా లవ్ స్టోరీ ఉంటుంది. నువ్ ఫామిలీ సినిమా చుసిన, యాక్షన్ సినిమా చుసిన, ఆఖరికి అన్న చెల్లెలా బంధం అంటూ వచ్చే గోరింటాకు సినిమా చుసిన ప్రేమే ఉంటుంది. అన్ని సినిమాల్లో ఇప్పుడు లవ్ అనేది కామన్ పాయింట్. అయితే అలా కామన్ గా కాకుండా బెస్ట్ లవ్ స్టోరీస్ ఏం ఉన్నాయ్ అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 

 

నిజం తెలుగు సినిమాల్లో ఎన్ని మంచి మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు వచ్చిన ఎక్కడో ఒక చోట చిన్న లవ్ స్టోరీ అయినా పెడుతున్నారు. నిజం,, లవ్ స్టోరీస్ అంటేనే ఏదో మేజిక్ ఉంటది.. అందరికి యిట్టె కనెక్ట్ అయిపోయే ఎలెమెంట్స్ ఎన్నో ఉంటాయి. అయితే సంవత్సరానికి ఎంత కాదు అన్న ఓ ఇరవై, ముప్పై లవ్ స్టోరీస్ తెరపైకి వస్తున్నాయి. 

 

అయితే గత పదేళ్లలో ది బెస్ట్ లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి.. కానీ అందరికి గుర్తుండిపోయే సినిమాలు ఓ పది ఉంటాయి అంతే. అలాంటి అద్భుతమైన సినిమాలు ఏంటో మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి. 

 

1. ఏమాయ చేసావే.. 2010 లో వచ్చిన లవ్ స్టోరీ ఇప్పటికి అద్భుతమే. 

 

2. ఆరంజ్.. ఫీల్ ది ఫ్రెష్ అండ్ రియల్ లవ్ అమ్మ.. 

 

3. ఇష్క్.. సింపుల్ బ్యాంగిల్ లవ్ స్టోరీ.. సూపరో సూపరూ. 

 

4. అందాల రాక్షసి.. ఓ సూపర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. 

 

5. ఊహలు గుసగుసలాడే.. ఎంత మంచి సినేమానో.. బెస్ట్ రైటర్ సినిమా ఇది. 

 

6. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. నిజంగానే మళ్లీ మళ్లీ ఇలాంటి అద్భుతమైన సినిమాలు రావేమో.. 

 

7. పెళ్లిచూపులు.. చదువు, సాఫ్ట్ వెర్ ఉద్యోగమే కాదు ప్రెజెంట్ జెనరేషన్ కి జీవితంపై ఒక ఆశయం అనేది ఉంది. 

 

8. ఫిదా.. సెన్సటివ్ మ్యాటర్స్ ని ఎంతో ప్రేమగా చూపించేశాడు శేఖర్ కమ్ముల. 

 

9. అర్జున్ రెడ్డి.. ఇది కాకపోతే మరొకటి అని కాకుండా.. ప్రేమించిన అమ్మాయే జీవితం అని అనుకునే అబ్బాయి స్టోరీనే అర్జున్ రెడ్డి. 

 

10. మజిల్.. ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే.. అర్జున్ రెడ్డిలా కాకుండా మళ్లీ ఓ జీవితం ఉంటుంది అని చెప్పే సినిమానే మజిలీ. 

 

ఇంకా ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉంటాయి.. అయితే మనం టాప్ 10 అనుకున్నాం కాబట్టి అక్కడికే ఇచ్చేశాం.

మరింత సమాచారం తెలుసుకోండి: