సాయి పల్లవి.. తన గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎంత చెప్పిన ఇంకా ఇంకా తన గురించి చెప్పాలి అని అనిపిస్తుంది. మంచి నటి, అద్భుతమైన అందం, మంచి రంగు అంతకంటే మంచి డ్యాన్సర్. ఇలా అన్ని మంచిగా ఉన్న ఈ సాయి పల్లవి యాక్టర్ కాకముందే డాక్టర్. ఎక్కడో మలయాళం సినిమా తిస్తే అందులో మలర్ గా సౌత్ ఇండియా మొత్తం పేరు తెచ్చుకుంది ఈమె నటనతో. 

 

ఇంకా ఆ సినిమాతో అప్పటికే అందరికి పరిచయం అయినా మలర్ తెలుగు ప్రేక్షకులకు భానుమతి హైబ్రిడ్ పిల్లా అంటూ శేఖర్ కమ్ముల పరిచయం చేసి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేశాడు.. అలాంటి అందాలా భామ గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

 

కోయంబత్తూర్ లోని కోటగిరి సాయి పల్లవి స్వస్థలం. 

 

ఈమె కేవలం ఒక యాక్టర్ మాత్రమే కాదు డాక్టర్ కూడా. డాక్టర్ సాయి పల్లవి. యూనివర్సిటీ అఫ్ జార్జియాలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. 

 

డ్యాన్స్ ఆమె ఎక్కడ కూడా వెళ్లి నేర్చుకోలేదు.. కేవలం ఐశ్వర్యా రాయి, మాధురి దీక్షిత్ వీడియోస్ చూసి డ్యాన్స్ నేర్చుకుంది. 

 

ఇంకా ఆమె ఎప్పటికైనా కూడా కార్డియాలజిస్ట్ అవ్వడమే ఆమె ఆశయం. 

 

సాయి పల్లవి ఫస్ట్ నటించిన సినిమా కంగా రనౌత్ ధామ్ డూమ్ తమిళ్ సినిమా. అన్నిటికంటే ఫస్ట్ ధీ 4 లో డ్యాన్స్ చేసి అదరగొట్టింది. 

 

అసలు ఆమె హీరోయిన్ అవుత అనుకోలేదు... ఎందుకంటే ఆమె స్కిన్ ప్రాబ్లెమ్ వల్ల.. కానీ ప్రేమమ్ డైరెక్టర్ దాన్ని కూడా ఎంతో అందంగా చూపించాడు.. ఆమెకు ఆ సమస్య ఉంది అనేదే మర్చిపోయేలా చేశాడు. 

 

ఇవేనండి.. మనం ఫిదా అయినా.. మనల్ని ఫిదా చేసిన హైబ్రిడ్ పిల్లా సాయి పల్లవి విషయాలు.. విశేషాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: