ఓటీటీ. ఇపుడు ఈ పేరు బాగా పాపులర్ అవుతోంది. ఎందుకంటే ఓ వైపు లాక్ డౌన్ తో థియేటర్లు అన్నీ మూతపడిపోయాయి. అదే సమయంలో జనాలకు కనీస వినోదం కూడా లేకుండా పోయింది. ఈ సమయంలో ఆపద్భాంధవిలా ఓటీటీ ఫ్లాట్ ఫారం రంగప్రవేశం చేసింది. ఓటీటీ ద్వారా సినిమాలు చూస్తే వీక్షకులు కూడా బాగా పెరిగారు.

 

ఇక లాక్ డౌన్, సినిమా హాళ్ళు మూతపడడాన్ని బాగా తనకు అనుకూలంగా ఓటీటీ నిర్వాహకులు ఉపయోగించుకున్నారు. ఈ దశలో కొత్త సినిమాలను కూడా ఓటీటీ ద్వారా రిలీజ్ చేయడానికి రంగం సిధ్ధం చేశారు. భారతీయ సినిమాలో ఓటీటీని ముందు పెట్టేందుకు కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో సినిమా థియేటర్ల యజమానులు కూడా ఓటీటీకి సినిమాలు ఇస్తే ఆ నిర్మాతలు హీరోల సినిమాలు బ్యాన్ చేస్తామని చెప్పేంతదాకా కధ నడిచింది.

 

ఇదిలా ఉండగానే పలువులు నిర్మాతలు, హీరోలు ఓటీటీ వల్ల సినిమాకు వచ్చే ఇబ్బంది లేదని చెబుతూ వచ్చారు. ఓటీటీ పెట్టుబడులు భారతదేశవ్యాప్తంగా కేవలం వేయి కోట్లు మాత్రమేనని, ఈ సొమ్ముతో ఎన్ని సినిమాలు కొనగలరని కూడా ప్రశ్నిస్తున్నారు.  ఇక తెలుగులో ఒక సినిమా నిర్మాణమే ఇపుడు 150 కోట్ల నుంచి మూడు వందల వరకూ పెరిగిందని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు అంటున్నారు.

 

అందువల్ల తమ సినిమా స్టామినా వేరు అని థియేటర్లో సినిమా చూడడం ఒక అద్వితీయ అనుభూతి అని చెబుతున్నారు. సినిమా చూడాలంటే ఎన్నో మార్గాలు ఉన్నా కూడా థియేటర్లలో చూస్తే వచ్చే ఫీల్ వేరు అని ఆడియన్స్ కి కూడా తెలుసు అంటున్నారు.మొత్తానికి చూసుకుంటే సినిమాలకు ఓటీటీ పోటీ కాదని అంటున్నారు.

 

మరి చూడాలి కరోనా మహమ్మారి ఇంకా అలాగే ఉంది. సాధరణ పరిస్థితులు ఎక్కడా నెలకొనలేదు. సినిమా హాళ్ళు ఎత్తేసినా సోషల్ డిస్టన్స్ పెద్ద సమస్య. దాన్ని ఎలా అమలుచేస్తారో చూడాలి. మళ్ళీ సాధారణ పరిస్థితులు వచ్చేంతవరకూ ఓటీటీ హవా అలా భారతదేశాన  సాగుతూనే ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: