కరోనా వైరస్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా నష్టపోయింది. వేసవికాలం కాబట్టి హీరోలు నిర్మాతలు ఎప్పటినుండో ప్లాన్ చేసుకుని భారీ భారీ సినిమాలు రిలీజ్ చేయడానికి అంతా రెడీ చేసుకుని సిద్ధంగా ఉన్నారు. అలాంటి సమయంలో పరీక్షలు అయిపోయాయి ఇంకా సమ్మర్ సెలవులు స్టార్ట్ అవుతాయి అని అనుకున్న సమయంలో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వేసుకున్న ప్లాన్స్ మొత్తం తారుమారు అయిపోయాయి. కరోనా వైరస్ పుణ్యమా విడుదల కావాల్సిన సినిమాలు కష్టాలు తెచ్చిన గాని కొన్ని విషయాల్లో మాత్రం తిరుగులేని గుడ్ న్యూస్ తో తెలుగు సినిమా వాళ్లకు పూర్వపు రోజులు తీసుకు వచ్చింది. పూర్తి విషయంలోకి వెళితే కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వాలు షూటింగులకు అనుమతులు త్వరలో ఇవ్వబోతున్నట్లు వార్తలు ఇప్పటికే మనం విన్నాం.

 

అయితే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవుట్ డోర్ షూటింగ్ కి పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి లేదని ప్రభుత్వాలు తేల్చశాయట. పరిమితమైన సిబ్బంది మధ్య షూటింగ్ జరుపుకోవాలని ఆదేశాలు ఇవ్వబోతున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్ల అంతా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టూడియోలను వదిలి ప్రతిదానికి అవుట్ డోర్ అంటూ వెళ్లిపోవడంతో… ఇండస్ట్రీలో స్టూడియో లన్ని మొన్నటి వరకు బోసిపోయాయి. ఇటువంటి సమయంలో కరోనా పుణ్యమా ఇప్పుడు అందరికీ స్టూడియోలే దిక్కయ్యాయి. అప్పట్లో సినిమాలు అంటే చాలా మంది సీనియర్ హీరోలు స్టూడియోలో దాదాపు లాగించేసేవారు.

 

పెద్ద పెద్ద అట్ట సెట్టింగులు క‌నిపిస్తూ ఉండేవి. ఆ త‌ర‌వాత అవుట్ డోర్‌ కి అల‌వాటు ప‌డ్డారు. దాంతో స్టూడియో బిజినెస్ లు టాలీవుడ్ లో మూతపడే స్థాయి కి చేరుకున్నాయి. పాట‌ల‌లో, ఇంటి సెట్ కో త‌ప్ప‌… ఎవ‌రూ స్టూడియోల వైపు క‌న్నెత్తి చూసిన సందర్భాలు మొన్నటి వరకు లేవు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం స్టూడియోల వైపు చూస్తున్నాయి. ఆల్రెడీ బడబడ హీరోలు పవన్ కళ్యాణ్, ప్రభాస్, చిరంజీవి మరియు  రాజమౌళి సినిమాల నిర్మాతలంతా ఇండస్ట్రీలో స్టూడియోలు బుక్ చేసేసుకున్నట్లు సమాచారం. మొత్తంమీద కరోనా దెబ్బతో మూత పడిపోతాయి అని అనుకున్న స్టూడియో లకు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు జీవం పోసినట్లయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: