నందమూరి బాలయ్య బాబు నటిస్తున్న సినిమాలు గత కొన్ని సంవత్సరాల నుండి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. బాలయ్య నటించిన చివరి చిత్రం ‘రూలర్’ భయంకరంగా అట్టర్ ఫ్లాప్ అయినా విషయం అందరికీ తెలిసిందే. ఇంతకుముందు ఎన్టీఆర్ బయోపిక్ రెండు సినిమాలు అయితే ఎలక్షన్ టైం లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడటంతో టిడిపి పార్టీకి బాలయ్య బాబు కెరీర్ కి మాయని మచ్చగా మిగిలిపోయింది. ఆ రెండు సినిమాలు ఫ్లాప్ కావడం పట్ల నందమూరి అభిమానులు తీవ్ర నిరుత్సాహం చెందారు. ఈ విధంగా బాలయ్య నటిస్తున్న అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్న తరుణంలో నందమూరి అభిమానులకు ఒక గుడ్ న్యూస్ లాంటి వార్త ఇండస్ట్రీ నుండి బయటకు వచ్చింది.

 

అదేమిటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలతో ఒక ప్లాప్ లేకుండా దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా ఓకే అయినట్లు సమాచారం. బాలయ్య బాబు 107 వ చిత్రంగా  అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా ఉండబోతున్నట్లు ఇప్పటికే స్టోరీలైన్ బాలయ్య బాబు విని అంతా ఓకే అయినట్లు ఫిలిం నగర్ టాక్. అనిల్ రావిపూడి మొట్టమొదటి సినిమా కళ్యాణ్ రామ్ తో ‘పటాస్’ ఆ తర్వాత 'ఎఫ్ 2' తర్వాత మహేష్ బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాలు సాధించాయి.

 

మూడు సినిమాలు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టు కలిగిన సినిమాలు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటిది అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలయ్య బాబు సినిమా ఓకే అవటం నిజంగా బాలయ్య బాబు అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం బాలయ్య బాబు - బోయపాటి దర్శకత్వంలో  సినిమా చేస్తున్నారు. ఇటీవల ఒక షెడ్యూలు కూడా కంప్లీట్ అయ్యింది. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ అయిపోయింది. జూన్ నెల నుండి మొదలుకాబోతున్నట్లు సమాచారం.  ఈ సినిమా అయినా వెంటనే అనిల్ రవిపూడితో బాలయ్య సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: