మామూలుగా అయితే  చాలా గూఢచార  పావురాలు గురించి మనం ఎక్కువగా సినిమాల్లో  చూస్తూ ఉంటాం. ఒకరి దగ్గర సమాచారాన్ని రహస్యంగా వేరే వ్యక్తుల దగ్గరికి చేర్చడం చేస్తూ ఉంటాయి పావురాలు. అయితే ఇలాంటివి నిజజీవితంలో చాలా తక్కువగా జరుగుతోంది. ఇలాంటి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది దేశ సరిహద్దుల్లో. ఇలా రహస్య పావురం ఘటనకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. కాశ్మీర్ లో ఉన్నటువంటి కుదువ  జిల్లాలో జరిగింది. మామూలుగా అయితే కేవలం గూడచారి సినిమాలలో కానీ పుస్తకాల్లో మాత్రమే ఇలాంటి ఘటనలు చూసి చదివి ఉంటాం  కానీ తాజాగా జరిగిన ఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. 

 


 సినిమా తరహాలోనే తాజాగా ఓ ఘటన జరిగింది. కాశ్మీర్ లోని ఈ ఘటన జరిగిన ప్రాంతంలో మామూలుగా ఒక పెన్సింగ్.. మరొకటి కంటికి కనిపించని పెన్సింగ్  ఉంటుంది అటువైపుగా ఎవరైనా వచ్చారు అంటే వెంటనే కంట్రోల్ రూమ్ కి సమాచారం అందిస్తుంది ఈ భద్రత పెన్సింగ్ ఉంటుంది. ఇలా వెంటనే సైన్యం అప్రమత్తమై ఎక్కడ ఏం జరిగింది ఎవరు ఆ భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారు అనే విషయాన్ని కనుగొంటారు. అయితే తాజాగా భారత సరిహద్దు నుంచి పాక్  సరిహద్దుల వైపు వెళ్తున్న ఒక పావురం... సదరు ఫెన్సింగ్ ఏరియా లో కి వచ్చి అకస్మాత్తుగా పడిపోయింది

 


 దీంతో వెంటనే  దీనిని గమనించిన స్థానికులు పోలీస్ లకు సమాచారం అందించారు . ఇక వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం సంఘటనా స్థలికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఒక పావురం పడిపోయింది. దీంతో ఆ పావురాన్ని స్వీకరించిన సైనికులను  పరిశీలించగా.. పాపురానికి రింగ్ తో  పాటుగా ఒక కోడ్  కూడా ఉంది. వెంటనే వారు ఆ కోడ్ ని  పరిశీలించగా .. అది ఒక గూడచారి కోడ్ అని తెలుసుకున్నారు. ఇలాంటి పావురాలు  ఎక్కువ దూరం ప్రయాణం చేస్తూ ఎంతో రహస్యంగా ఎవరికీ కనిపించకుండా సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాయి గ్రహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: