ఊపిరి సినిమా.. చుసిన తర్వాత అనిపిస్తుంది... అవిటి వాళ్ళపై చుపించాల్సింది జాలి కాదు ప్రేమ అని. మనకు ఎవరైనా అవిటి వాళ్ళు కనిపించరు అంటే చాలు అయ్యో అని అంటాం.. వారికీ ఏదైనా హెల్ప్ చేస్తే ఏదో సాధిచినట్టు ఫీల్ అవుతాం. కానీ నిజానికి అవిటి వారిపై జాలి చూపిస్తే వారు బాధపడతారు.. ఆనందపడారు. 

 

అదే మనం మనతో పాటు వారిని చూసుకుంటే వారికి మోరల్ గా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఏదైనా అవయవం లేదు అని అయ్యో.. పాపం అని చూపించడం కంటే కూడా వారిని పసిపిల్లల చూసుకుంటే వారికీ బాధ ఉండదు.. అలాగే కాస్త అయినా ఆనందపడుతారు. అలా వారికీ కాస్త మోరల్ సపోర్ట్ అందుతుంది. 

 

ఇంకా ఊపిరి సినిమాలో చెప్పింది కూడా ఇదే.. ఫీజికల్ డిసేబుల్ అయినా ఓ వ్యక్తికి కూడా ఒక జీవితం ఉంటుంది అని.. దానితో సంతోషంగా జీవించచ్చు అని హోప్ తెప్పించే సినిమా ఇది. పసి పిల్లలు నడవలేరు అని.. కదలలేరు అని మనం వదిలేయం కదా! ఆకలి అనేది తెలీకుండా పాలు ఇస్తాము.. వాళ్ళు మాట్లాడకపోయినా ఓయ్ బుజ్జి.. హాయ్ చిన్నోడా అంటూ మనం పలకరిస్తాము. 

 

అలానే ఫీజికల్ డిసేబుల్ కూడా.. వారికీ ఓ జీవితం ఉంటుంది అని.. వారు కూడా ఆనందంగా బ్రతకగలరు అని చెప్పిన సినిమానే ఇది.. ఊపిరి అంటే సెలబ్రేషన్ అఫ్ లైఫ్ అంతే.. మనిషిలో ఊపిరి ఒకటి ఉంటే చాలు వారికి జీవితంపై ఆశ చూపించచ్చు.. ఏలాంటి ఫిజికల్ డిసేబుల్ అయినా ప్రేమించే ఓ వ్యక్తి పక్కన ఉంటే చాలు జీవితం అంత హ్యాపీగా సాగిపోతుంది.                                      

మరింత సమాచారం తెలుసుకోండి: