ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ హవా స్టార్ట్ అయింది. మనకి ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎక్కువగానే అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్‌, సన్ నెక్స్ట్, ఆల్ట్ బాలాజీ, జీ 5, ఎం ఎక్స్ ప్లేయర్, ఎరోస్, ఆహా.. ఇలా చాలా ఓటీటీ యాప్స్ సక్సెస్ అయ్యాయి. కరోనా లాక్ డౌన్ పుణ్యమా అంటూ ఇంకా ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇంటికే పరిమితమైన జనాలు ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ సినిమాలను వెబ్ సిరీసులను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ దే రాజ్యం కాబోతుందని భావిస్తున్న నటీనటులు దర్శక నిర్మాతలు ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు. సినిమాలకు మించిన బడ్జెట్లు పెట్టడానికి ఓటీటీ సంస్థలు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే మన టాలీవుడ్ నుండి హీరో హీరోయిన్స్ డైరెక్టర్లు వెబ్ సిరీస్ వైపు అడుగులు వేశారు. టాలీవుడ్ లో ఇప్పటికే క్రిష్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్లు వెబ్ సిరీస్ లలో అడుగుపెట్టారు. ఇప్పుడు లేటెస్టుగా మరో డైరెక్టర్ కమ్ హీరో రాబోయే రోజుల్లో ఓ వెబ్ సిరీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అతనే రాహుల్ రవీంద్రన్. 

 

హీరోగా కొనసాగుతూనే సుశాంత్ తో 'చి.ల.సౌ' సినిమాతో డైరెక్టర్ గా మారాడు రాహుల్ రవీంద్రన్. తన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. అయితే తన రెండో చిత్రంగా కింగ్ నాగార్జున హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా 'మ‌న్మ‌థుడు 2' సినిమాను తెరకెక్కించాడు. రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. అప్పటి నుండి మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు రాహుల్. కాగా ప్రస్తుతం తన కొత్త స్క్రిప్ట్‌ను పూర్తి చేసే దిశలో ఉన్నాడు రాహుల్. అయితే ఈ సారి స్క్రిప్ట్ రాస్తోంది సినిమా కోసం కాదు.. వెబ్ సిరీస్ కోసమట. నెట్‌ ఫ్లిక్స్ కోసం ఒరిజినల్ వెబ్ సిరీస్‌ కు దర్శకత్వం వహించబోతున్నాడట. ఈ వెబ్ సిరీస్ లో వెన్నెల కిషోర్ నటించబోతున్నాడని సమాచారం. అయితే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో భాగమైన ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్స్‌ లో రాహుల్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ ర‌వీంద్ర‌న్ ప్రస్తుతం డైరెక్టర్ గా బిజీ అవుతుండటం విశేషం. మరి ఇప్పుడు వెబ్ వరల్డ్ లో కూడా అడుగుపెట్టి తన సత్తా చాటుతాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: