టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా ఒక సంచలనం. ఈ సినిమా సాధించిన విజయం గాని ఈ సినిమాలో ఉన్న ప్రతీ సన్నివేశం గాని ప్రేక్షకులకు అలా గుర్తుండి పోయింది సినిమాను ఎవరు విమర్శించినా సరే ఏదోక సమయంలో ఆ సినిమా కచ్చితంగా కీర్తించారు అనేది వాస్తవం. ముఖ్యంగా హీరో నటన చూసిన ప్రేక్షకులు అయితే ఆ సినిమాలో ఆ హీరో మినహా ఎవరు నటించినా సరే సినిమా ఆ స్థాయిలో ఉండేది కాదు అని చాలా మంది కామెంట్స్ చేసారు. ఆ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు చూసి బాలీవుడ్ కూడా ఫిదా అయిపొయింది అనేది వాస్తవం. 

 

అందుకే ఆ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసారు. ఈ సినిమా టాలీవుడ్ లో ఎన్నో రికార్డ్ లను కూడా నమోదు చేసింది. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమాలో ఉండే సందేశం నేటి యువతను బాగా ఆకట్టుకుంది. ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి కోసమే జీవితం త్యాగం చెయ్యాలి అనే సందేశం సినిమాలో ఉంటుంది. అర్ధం కాని వాడికి అర్ధం కాని విధంగా ఉన్నా సరే ప్రేమ కోసం ఎక్కడి వరకు అయినా వెళ్ళవచ్చు ఏది అయినా చేయవచ్చు అని ఆ సినిమా చూపించింది. ప్రేమ కోసం ఏ త్యాగం చేసినా సరే తప్పు లేదు అనే విధంగా సినిమా ఉంది. 

 

ఆ సినిమాలో హీరో అయినా హీరోయిన్ అయినా సరే ప్రేమించిన వ్యక్తి కోసం మాత్రమే బాధ పడతారు గాని ప్రేమించిన వ్యక్తి దూరం అయిన తర్వాత వదులుకుని వేరే వారి తో సంతోషంగా ఉందాం అని అనుకున్న సీన్ ఒక్కటి కూడా ఉండదు. సినిమాను ఆ విధంగా అందంగా అందించారు ప్రేక్షకులకు. అందుకే ఈ తరానికి అలా నచ్చింది సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: