బిజినెస్ మ్యాన్.. మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం బిజినెస్ మ్యాన్. ఈ సినిమాలో సూర్య భాయ్ గా యువతకు జీవితం గురించి ఎన్నో అద్భుతమైన పాఠాలు చెప్పిన సినిమా బిజినెస్ మ్యాన్. అయితే ఆ అద్భుతమైన జీవిత సత్యాలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చూసి తెలుసుకుందాం.
1. సాధారణంగా బ్రతకాలి అని అనుకోకు.. గొప్పగా అలోచించి... గొప్పగా బ్రతుకు.
2. స్టార్ట్ అప్ గురించి ఎప్పుడు తక్కువగా ఆలోచించకు.. ఏమి లేకుండా మొదలు పెట్టిన ఏదైనా సాధించేస్తారు. ఏదైనా సాధించాలి అని మనకు ఉండాలి.. అప్పుడే సాధించగలం.
3. లీడర్ గా దైర్యంగా ముందుకు అడుగు వెయ్యాలి.. అప్పుడే నీ టీం కూడా ముందడుగు వేస్తుంది.
4. ఎక్కడ ఎవరి కోసం పని చేయకండి.. నీకోసం చెయ్యి.. నువ్వే సొంతంగా జీవించు.
5. నువ్వు ఎదగాలి అని అనుకుంటే.. నీకు దైర్యం కూడా అంతే ఉండాలి.. అప్పుడే నువ్వు గొప్పవాడివి అవుతావు.
6. ఎవడి సినిమా వాడిది.. వాడి సినిమాకి వాడే హీరో. ఎవడి కోసం మన ఆటిట్యూడ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు.
7. నీ కంపెనీ ఎంప్లాయిస్ బాగా పని చెయ్యాలి అంటే నువ్వు వాళ్ళకి బాగా జీతాలు ఇవ్వు.. ఆనందంగా బాగా పని చేస్తారు.
8. మన పేరు ఏ ఒక బ్రాండ్ అవ్వాలి.. అలా పని చెయ్యాలి..
చూశారుగా.. ఎన్నో అద్భుతమైన ప్రస్తుత జీవిత సత్యాలు చెప్పిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఈ సినిమాకు మంచి ఫాలోయింగ్ లభించింది.