పెళ్లి చూపులు... ఈ తరానికి చాలా బాగా నచ్చిన సినిమాల్లో ఒకటి. విజయ్ దేవరకొండ రీతు వర్మ హీరో హీరోయిన్ లు గా వచ్చిన సినిమా ఇది. ప్రధానంగా హీరో హీరోయిన్ నటన కు ఈ సినిమాలో మంచి మార్కులు పడగా ఆ తర్వాత సినిమా కథకు ప్రేక్షకులు మంచి మార్కులు వేసారు. కథ మొత్తం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఇక సినిమాలో కామేడి కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది అని చెప్పవచ్చు సినిమాలో ఉండే ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది అనేది వాస్తవం.

 

ఇక సినిమాలో ఉన్న మెసేజ్ విషయానికి వస్తే ఎవరి మీద కూడా ఒక వ్యక్తి ఆధారపడకుండా తన బ్రతుకు తాను ఎలా బ్రతకాలి అనే సందేశం సినిమాలో ఉంటుంది. సంపాదన విషయంలో ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఉండే విధంగా సినిమాలో చూపించారు. ఒక ఫుడ్ ట్రక్ అనే కాన్సెప్ట్ తో సినిమాను ముందుకు నడిపించారు. టాలీవుడ్ లో ఆ సినిమాకు ఈ తరంలో మంచి మార్కులు పడిన సంగతి తెలిసిందే. విమర్శకులు కూడా సినిమాను కొనియాడటం విశేషం. ఇక సినిమాలో నటించిన విజయ్ కి కూడా నటుడిగా మంచి మార్కులు పడ్డాయి అని చెప్పవచ్చు. 

 

ఇక అది అలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన రీతు వర్మ మొదలు పెట్టిన కాన్సెప్ట్ ఫుడ్ ట్రక్ ఆ తర్వాత చాలా మంది యువత ఆదరించి దానిని లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి వాడుకున్నారు. ఆ విధ౦గా సినిమా ప్రేక్షకులను ఆదరించింది. ఇక విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. ఈ సినిమా తర్వాత అతను రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: