జనతా గ్యారేజ్... జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో వచ్చిన ఒక అందమైన సినిమా ఇది. ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రాగా ఈ సినిమా అనేక రికార్డులను కూడా బద్దలు కొట్టింది. తారక్ కెరీర్ లో మంచి వసూళ్లు సాధించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో తనదైన శైలిలో నటించి మెప్పించారు. ఇక సినిమా కథ కూడా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. ఇక సందేశం అనేది సినిమాలో ఉండటం తో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు అనేది వాస్తవం. 

 

ముఖ్యంగా ప్రకృతి ని ఏ విధంగా కాపాడుకోవాలి అనేది ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమా ద్వారా తారక్ కూడా ఒక మంచి సందేశం ఇచ్చాడు. చెట్లను కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరు కూడా ముందుకు రావాలని మనకు చెట్లు చాలా అవసరం అని పర్యావరణం మన జీవితంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది అని ఈ సినిమా ద్వారా తారక్ సమాజానికి చెప్పాడు. ఈ సినిమా కథ ను ప్రేక్షకులు ఆదరించడానికి ప్రధాన కారణం కూడా తారక్. సినిమా కథకు తగిన విధంగా అందంగా నటించడమే కాకుండా యువతలో కూడా ఈ సినిమా ద్వారా ఒక మెసేజ్ బలంగా ఇచ్చాడు. 

 

ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పలు చోట్ల మొక్కలను కూడా స్వచ్చందంగా నాటారు. సేవా కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఈ చెట్లను ఇప్పటికి పైకి తీసుకొస్తున్నారు. ఈ సినిమా అతని అభిమానుల్లో మంచి మార్పు తీసుకొచ్చింది అనేది వాస్తవం. ఇక ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ కూడా స్టార్ దర్శకుడిగా ఇక్కడి నుంచి మరింత పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కొరటాల చిరంజీవి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: