పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసినప్పటి నుండి అభిమానుల్లో ఆనందం ఉరకలెత్తింది. రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ ని తెరమీద చూడబోతున్నామన్న ఆనందంతో ఉన్నారు. అన్నీ సవ్యంగా జరిగితే ఈ పాటికే వకీల్ సాబ్ చిత్రం రిలీజై ఉండేది. కానీ కరోనా మహమ్మారి పవన్ వేసుకున్న ప్లాన్స్ అన్నింటికీ తారుమారు చేసింది. దాంతో వకీల్ సాబ్ ని ఈ వేసవిలో చూద్దామని అనుకున్నవాళ్లకి నిరాశే మిగిలింది.

 


బాలీవుడ్ పింక్ సినిమా తెలుగు రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తయింది. ఒక్క పదిరోజుల్ షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుండి చిత్రీకరణకి అనుమతులు రాగానే వకీల్ సాబ్ షూటింగ్ పనులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పదిరోజులు షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడట.

 

అయితే వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ భారీగా తీసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. అంతా సజావుగా జరిగితే ఆ రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి మార్పులు వచ్చేవి కావేమో. కానీ ప్రస్తుత పరిస్థితులని చూస్తుంటే, సినిమాలని నిర్మించడానికే ఇబ్బంది పడే రకంగా ఉంది. అదీగాక లాక్డౌన్ మొదలయినప్పటి నుండి థియేటర్లు మూతబడిపోవడంతో నిర్మాతలు చాలా నష్టపోయారు.

 

ఇప్పటికీ థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. తెరుచుకున్నా మునుపటిలా జనాలు సినిమా చూడడానికి వస్తారా అన్నది సంశయమే. సో వీటన్నింటి మధ్యలో హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి పవన్ కూడా వకీల్ సాబ్ కోసం రెమ్యునరేషన్ తగ్గించుకుంటాడా లేదా చూడాలి. గతంలో చాలా సార్లు పవన్ తన రెమ్యునరేషన్ ని తగ్గించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: