విజయశాంతి సినీ కెరీర్ లో వచ్చిన మంచి సినిమాల్లో ప్రత్యేకంగా  చెప్పుకునే సినిమా ఒసేయ్ రాములమ్మ. ఈ సినిమా ద్వారా విజయ శాంతికి బాలీవుడ్ లో కూడా పేరు వచ్చింది. ఈ సినిమాలో ఉండే పాటలు ఈ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. ఈ సినిమా దాసరి నారాయణ దర్శకత్వంలో వచ్చింది. టాలీవుడ్ లో ఈ సినిమా ఒక సంచలనం. ఈ సినిమా ఒక ట్రెండ్ సృష్టించింది. విజయ శాంతి నటన చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. విమర్శకులు కూడా ఈ సినిమాను చూసి షాక్ అయ్యారు. 

 

ఆ రేంజ్ లో ఉంది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత విజయ శాంతి స్థాయి కూడా ఒక రేంజ్ కి వెళ్ళింది అనేది వాస్తవం. ఇక ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని మెసేజ్ లు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అది ఏంటీ అంటే... దళిత యువత పై అన్యాయం జరిగితే ఆమె ఒక పోరాట యోధురాలి గా ఏ విధంగా మారాలి ఏ విధంగా తన ప్రాణాలను కాపాడుకుంటూ నే సమాజానికి ఏది చెప్పవచ్చు అనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది. విమర్శకులు సైతం ఈ సినిమాను చూసి మెసేజ్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా చూపించింది. 

 

దళితులపై అప్పటి వరకు ఎన్నో నేరాలు ఘోరాలు జరిగాయి. ప్రతీ ఒక్కరు ఒక శక్తిగా మారితే ఏ విధంగా పోరాడా వచ్చు మనకు జరిగే అన్యాయాలను ఏ విధంగా ఎదిరించవచ్చు అనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఈ సినిమా తర్వాత విజయ శాంతి ఇండియన్ సూపర్ స్టార్ గా మారిపోయారు. దళిత మహిళలు కూడా పోరాటం చేయడానికి సిద్దపడ్డారు. తెలంగాణాలో కొన్ని జిల్లాల్లో మహిళలు ఉద్యమంలోకి కూడా వెళ్ళారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: