క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించాడు. శాతవాహన డైనస్టీ లో అత్యంత శక్తివంతమైన రాజు అయిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్రపై ఈ చిత్రం చేయబడింది. ఇప్పటికే భారత దేశంలో గౌతమీపుత్ర శాతకర్ణి గురించి ఎన్నో సినిమాలు సీరియల్స్ ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. అందరూ అతను భారత దేశాన్ని ఎలా ఏలాడు(పరిపాలించాడు) అని చూపించగా... క్రిష్ జాగర్లమూడి మాత్రం గౌతమీపుత్ర శాతకర్ణి రెండు రాజ్యాలను ఎలా ఓడించాడని... బ్రిటిష్ కింగ్ డమ్ ని కూడా ఎలా ఓడించాడు అనేది చూపించాడు. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్, సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగులు, బ్యాగ్రౌండ్ స్కోర్ తదితర అంశాలు అత్యద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులకు ఒక మధురమైన అనుభూతి కలిగింది అని చెప్పుకోవచ్చు. 


దర్శకుడు క్రిష్ జాగర్లమూడి గౌతమిపుత్ర శాతకర్ణి రాజసం వెండితెరపై చాలా చక్కగా చూపించాడు. అతని క్యారెక్టర్ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ధైర్యే సాహసే లక్ష్మి అనే నినాదంతో ముందుకు సాగిన గౌతమీపుత్ర శాతకర్ణి మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. కంచె లాంటి అద్భుతమైన సినిమా ని మనకు అందించిన క్రిష్ జాగర్లమూడి మళ్లీ గౌతమీపుత్ర శాతకర్ణి తో బాగా ఎంటర్టైన్ చేసాడు. 


భావోద్రేక సన్నివేశాలను మినహాయించి ఈ సినిమాలో ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు, మిరుమిట్లు గొలిపే పురాతన భవనాలను ఏ సినిమాలో ప్రతి ప్రేక్షక అభిమానుల కు నచ్చుతుంది. బాలయ్య బాబు కూడా ఈ చిత్రంలో చాలా అద్భుతంగా నటించి తన అభిమానులను బాగా ఎంటర్టైన్ చేశాడు. ఇటువంటి సినిమాలు తెలుగు పరిశ్రమలో రావడం చాలా అరుదు. అందుకే ప్రతి ఒక్కరూ ఏ సినిమా అని కచ్చితంగా ఒక్కసారి అయిన చూసి మన పూర్వీకుల మచ్చలేని వ్యక్తిత్వం నుండి ఎన్నో నేర్చుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: