బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా చేస్తున్నాడు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మోషన్ పొస్టర్ తో పాటు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ ని విడుదల చేసి ఆ అంచనాలని మరింతగా పెంచేశారు. ఇప్పటికే డైభ్బై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా చిత్రీకరణని వాయిదా వేసింది.

 

కరోనా ఉధృతి రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో చిత్రబృందానికి టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే అనుకున్న టైమ్ కి రిలీజ్ అవ్వదని తేల్చేశారు. జనవరిలో విడుదల తేదీ అనుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల వల్ల అప్పట్లోగా సినిమా రెడీ అయ్యే అవకాశం లేకపొవడంతో రిలీజ్ డేట్ ని వేసవికి మార్చుకున్నారు. అయితే అదలా ఉంచితే బిజినెస్ విషయంలో రాజమౌళికి టెన్షన్ పట్టుకుందట.

 

 

సినిమా అనుకున్నప్పుడే బడ్జెట్ విషయంలో ఎంత వరకూ పెట్టాలనేది ఒక అంచనా ఉంటుంది. ఆర్.ఆర్.ఆర్ విషయంలోనూ అలాంటి అంచనా వేసుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆ అంచనాలన్నీ తప్పిపోయాయి. ప్రస్తుతం మళ్ళీ బడ్జెట్ పరంగా కొత్త ప్లాన్స్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదీగాక థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో ఇంకా తెలియదు. తెరుచుకున్నా కూడా జనాలు ఇంతకుముందులా థియేటర్ కి వస్తారా అన్నది సందేహమే.

 

 

వీటన్నింటి మధ్యలో బడ్జెట్ పరంగా సినిమాకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బయ్యర్లు ఇంతకుముందులా ఫ్యాన్సీ రేటు చెల్లిస్తారా అన్నది అనుమానంగా ఉంది. ఏది ఏమైనా ఆర్.ఆర్.ఆర్ బడ్జెట్ విషయంలో రాజమౌళికి టెన్షన్ పట్టుకుందిట. అయితే వచ్చే సంవత్సరం వేసవి వరకు అంతా కుదుటపడితే ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: