తల్లి ప్రేమకు మరేదీ  సాటిలేదు.. ఉండదు కూడా. ఎన్నోసార్లు ఈ విషయాన్ని ఎందరో మాతృమూర్తులు నిరూపించారు. వెలకట్టలేనిది ఏదైనా ఉందా అంటే అది కేవ‌లం తల్లి ప్రేమే. ఈ లోకంలో తల్లి ప్రేమ అనేది చాలా విలువైనది. తల్లి ప్రేమలో కల్మషం అంటూ ఏమి ఉండదు. తల్లి ఎప్పుడూ కూడా తన బిడ్డలను ఒకేరకంగా చూసుకుంటుంది. తాము మరణించినా సరే.. తన బిడ్డకు ఏ ఆపదా రాకూడదని కోరుకుంటుంది. అలాంటి త‌ల్లి కోసం ఏదైనా చేయొచ్చు అని మంచి మెసేజ్ ఇచ్చిన సినిమానే `బిచ్చగాడు`. ఆకట్టుకునే కథ, కంటెంట్ ఉంటే ఆ సినిమా హిట్టేనని ఇటీవ‌లి కాలంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించిన డ‌బ్బింగ్‌ చిత్రం బిచ్చ‌గాడు.

 

విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం 'పిచ్చైకారన్' ను తెలుగులో 'బిచ్చగాడు' అనే టైటిల్‌తో 2016లో విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విష‌యం సాధించింది. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. క‌థ విష‌యానికి వ‌స్తే.. అరుల్ సెల్వ కుమార్ (విజయ్ ఆంటోనీ) ఓ కోటీశ్వరుడు. అమెరికాలో చదువు పూర్తి చేసుకున్న ఆరుల్, ఇండియాలో తన తల్లి భువనేశ్వరి (దీపా రామానుజం) నిర్వహిస్తున్న కాటన్ ఇండస్ట్రీస్ ని చూసుకొనేందుకు వస్తాడు. అయితే అనుకోకుండా తన ఫ్యాక్టరీ లోనే తన తల్లికి జరిగిన ఓ చిన్న యాక్సిడెంట్ కారణంగా ఆమె కోమాలోకి వెళ్లిపోతుంది. 

 

 ఆమెను బతికించుకోవడానికి అరుల్ అల్లోపతీ, ఆయుర్వేదం లాంటి అన్ని రకాలైన వైద్యాలు చేయిస్తాడు. కానీ ప్రయోజనం ఉండదు. వైద్యులు ఆమె ఇక ఎంతో కాలం బతకదనీ ఇంటికి తీసుకెళ్ళమని చెబుతారు. అయితే ఆఖరికి ఓ స్వామీజీ 48 రోజులపాటు అరుల్ బిచ్చగాడు గా దీక్ష తీసుకుంటే తల్లి కోమా నుంచి బయట పడే అవకాశం ఉందని చెప్పడంతో అరుల్ భిక్షగాడిగా మారతాడు. ఈ క్ర‌మంలోనే ఎన్ని క‌ష్టాలు ఎదురైనా.. వెనుక‌డుగు వేయ‌కుండా దీక్ష పూర్తి చేసి త‌ల్లిని బ‌తికించుకుంటారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని అద్భుతమైన నటన, త‌ల్లి కోసం కొడుకు ప‌డే తాప‌త్ర‌యం, సంగీతం, డైరెక్టర్ శశి టేకింగ్ సహా ప్రతి ఎలిమెంట్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి.

 

అస‌లు ఇలాంటి ఓ కథాంశంతో సినిమా తియ్యాలి అన్న ఆలోచన వచ్చినందుకు ముందు దర్శకుడు శశి ని అభినందించాలి. ఇక ఇలాంటి సినిమాకు విజయ్ ఆంటోని కూడా ఒప్పుకోవ‌డం మ‌రో విశేషం. ముఖ్యంగా సినిమాలోని మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ పాయింట్స్ సహా చాలా సన్నివేవాలు ఆడియెన్స్ బాగా ఆక‌ట్టుకుంటాయి. అందుకే ఈ సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు సైతం సూప‌ర్ హిట్ చేశారు.

 


 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: