ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. సరదాగా సాగిపోయే ఫీల్ గుడ్ మూవీస్, సమాజం కోసం వ్యవస్థలపై పోరు సాగించే సినిమాలు, స్నేహిం విలువ చెప్పే సినిమాలు.. చాలా వచ్చాయి. అయితే.. స్నేహం ముసుగులో నటించే వారి కోసం స్నేహితులు జాగ్రత్తగా ఉండాలని చెప్పే సినిమా కూడా వచ్చింది. అదే ‘శంభో శివ శంబో’. తమిళ్ లో వచ్చిన నాడోడిగల్ అనే సినిమాకు ఇది తెలుగు రీమేక్. స్నేహితుడి కోసం సర్వం పోగొట్టుకుని.. అవకాశం కోసం స్నేహాలు చేసేవారిని నమ్మకూడదనే పాయింట్ లో ఈ సినిమా ఉంటుంది.

IHG

 

ఫ్రెండ్ సాయం అడిగితే ముందూ వెనుకా చూడకుండా అతనికి సాయం చేయడానికి వెళతారు రవితేజ, అల్లరి నరేశ్, శివ బాలాజీ. కానీ.. వారు చేసింది తప్పు అని తెలిసే సరికి జీవితాలే కోల్పోతారు. కుటుంబాలకు దూరం అవుతారు. సమాజంలో తప్పు చేసిన దోషులుగా మిగిలిపోతారు. సాయం పొందిన స్నేహితుడి నుంచే సరైన కృతజ్ఞత దక్కదు. సాయం పొందిన వ్యక్తి రవితేజకు మాత్రమే స్నేహితుడు. కానీ తమ ఫ్రెండ్ కు ఫ్రెండ్ అంటే మాకూ ఫ్రెండే అనే స్నేహ ధర్మంతో అల్లరి నరేశ్, శివ బాలాజీ సాయం చేసి నష్టపోతారు. స్నేహం చేయడం ముఖ్యం.. ఆ స్నేహం ముసుగులో ఎటువంటి వాళ్లతో స్నేహం చేస్తున్నామనే జాగ్రత్త ఉండాలని ఈ సినిమా చెప్తుంది.

IHG

 

తమిళ్ లో ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సముద్రఖని తెలుగు సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. తమిళ్ లో హిట్ అయింది. తెలుగులో మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా పేరు తెచ్చుకుని ఎబౌ యావరేజ్ గా మిగిలింది. ఫలితం ఎలా ఉన్నా స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ సినిమా చెప్తుంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా ‘శంభో శివ శంభో’కు పేరు దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: