పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూనే 3 సినిమా ప్రాజెక్టులకు ఒప్పుకున్నాడు. పింక్ కి రీమేక్ చిత్రమైన వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు నిర్మాత బాధ్యతలు వహిస్తున్నాడు. భారత దేశ వ్యాప్తంగా రెండు నెలలకు పైగా సినిమా షూటింగ్ లు అన్నీ స్తంభించి పోవడంతో... వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ కూడా ఆగిపోయింది. ఈ చిత్రం దాదాపు పూర్తికాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన 30 రోజుల షెడ్యూల్ మిగిలి ఉంది. అయితే తాజాగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చిత్రం షూటింగులో చేరుకోవచ్చని ఆదేశాలు జారీ కావడంతో... అర్ధంతరంగా నిలిచిపోయిన అన్ని సినిమా షూటింగ్స్ పునః ప్రారంభమయ్యాయి.


కానీ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం మాత్రం కొద్దిరోజుల పాటు వాయిదా పడింది. ప్రస్తుతం భారతదేశంలో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని వకీల్ సాబ్ చిత్ర యూనిట్ దృష్టికి తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్ కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గుదల పట్టిన తర్వాత చిత్రీకరణ ప్రారంభిద్దామని చెప్పారట. దానికి అంగీకరించిన నిర్మాత దిల్ రాజు, మిగతా చిత్ర బృందం కూడా వేసవి కాలం పూర్తయిన తర్వాత అనగా జులై మధ్యభాగంలో షూటింగ్ ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


చిత్ర షూటింగ్ ని కాస్త వాయిదా వేయాలని సూచించిన పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం వెంటనే ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారట. ఇప్పటికే తన సినిమా వెండి తెరపై కనిపించి దాదాపు రెండేళ్లు గడుస్తుంది. వాస్తవానికి వకీల్ సాబ్ చిత్రం మే 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. కానీ అనుకోకుండా కరోనా మహమ్మారి భారతదేశంలో అడుగుపెట్టడంతో ఆ ముహూర్తం కాస్త చెడిపోయింది. ఏదేమైనా ప్రేక్షకులకు ముందుగా మాట ఇచ్చినట్టు అతి తొందరలోనే వకీల్ సాబ్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: