తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు వారి వారసుడిగా మెగా మేనల్లుడి గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు అర్జున్ తనదైన నటనతో... ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. అయితే అల్లుఅర్జున్ ఇప్పటివరకు ఎన్నో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ నటించిన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఒకటి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ సినిమాలో ప్రస్తుతం ఉన్న జనరేషన్లో యూత్ అందరికీ ఒక మంచి మెసేజ్ కి ఇచ్చాడు అల్లు అర్జున్. సరిహద్దుల్లో శత్రువులతో పోరాడే సైనికుడిగా నటించిన అల్లు అర్జున్ పూర్తిగా తన లుక్ తన బాడీని సైనికుల్లా గానే మలచుకున్నాడు. 

 

 ఇక ఈ సినిమాలో అల్లుఅర్జున్ ఎంతో కోపిష్టి గా ఉంటాడు. దీంతో అతనిని ఆర్మీ నుంచి ఒక డాక్టర్ దగ్గరికి కోపం తగ్గించుకోవాలి క్యారెక్టర్ని మార్చుకోవాలని చెప్పి పంపిస్తారు. కొన్ని రోజుల్లో అల్లు అర్జున్ తన క్యారెక్టర్ని మార్చుకుంటాడు... కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ కి అర్థం అవుతుంది తన క్యారెక్టర్ ఎంతో గొప్పదని... తన క్యారెక్టర్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది అని అర్థం చేసుకొని... సినిమా క్లైమాక్స్ లో క్యారెక్టర్ ఒక మనిషికి ఎంత ముఖ్యమో అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. 

 

 ఒక మనిషికి క్యారెక్టర్ లేదు అంటే ప్రాణం లేనట్లే అంటూ తెలిపి... ఒక మనిషి జీవితంలో అతని క్యారెక్టర్ ఎంత ముఖ్యమో చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా... ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రతి మనిషికి ఒక క్యారెక్టర్ ఉంటుందని దానిని వదులుకోకూడదు అంటూ చెప్పుకొచ్చాడు.ఇక ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి. నేటితరం జనరేషన్లో పరిస్థితులకు తగ్గట్టుగా తమ క్యారెక్టర్ని మార్చుకుంటూన్న  యూత్ కి  ఈ సినిమా మంచి మెసేజ్ ఇచ్చింది. ఒక మనిషి జీవితంలో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నది ఈ సినిమాలో అందరికీ తెలియజేసాడు అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి: