అప్పటికే ఆ నలుగురు సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న రాజేంద్రప్రసాద్ ఈశ్వర్ రెడ్డి డైరక్షన్ లో చేసిన సినిమా మీ శ్రేయోభిలాషి. తమ జీవితంలో వచ్చిన చిన్న చిన్న సమస్యలను తట్టుకోలేక చనిపోవడమే పరిష్కారం అనుకుని ఉన్న కొంతమంది ఆలోచనలో మార్పుని తీసుకురావడమే ఈ సినిమా ప్రయత్నం. ఈ సినిమా మొత్తం నేపథ్య గీతంతో నడిపించాడు దర్శకుడు. చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిలా బ్రతకాలి అంటూ బాలు పాడిన పాట సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. 


తమకు వచ్చిన ప్రతి సమస్యకు చావే పరిష్కారం అనుకుని ఆత్మహత్య చేసుకుంటున్న నేటి యువతకు మంచి  సందేశం ఇచ్చిన సినిమా మీ శ్రేయోభిలాషి. ఎప్పుడు రెగ్యులర్ సినిమాలు చూసి కాసేపు నవ్వుకుని, కమర్షియల్ సినిమాల యాక్షన్స్ ఫైట్స్ చూసి మెచ్చిన ప్రేక్షకులు ఇలాంటి హృదయానికి దగ్గరగా ఉండే సినిమాలను కూడా ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఏదైనా చిన్న బాధ వచ్చినప్పుడు దాన్ని ఫెజ్ చేయకుండా చావుని పరిష్కారంగా భావించే వారికి ఈ సినిమా ఒక కనువిప్పుగా ఉంటుంది. సినిమాలో ప్రతి సందర్భంలో జీవిత అనుభవ సారాన్ని చెప్పే పాత్రలో రాజేంద్ర ప్రసాద్ సూపర్ గా నటించారు. 


ఇలాంటి సినిమాలు చేయాలంటే రాజేంద్ర ప్రసాద్ మాత్రమే చేయాలి అనేలా మీ శ్రేయోభిలాషి హిట్ అయ్యింది. సినిమా కథ, కథనం, నేపథ్య గీతం మీ శ్రేయోభిలాషి సినిమాకు హైలెట్ గా నిలిచాయి. తెలుగు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో మీ శ్రేయోభిలాషి ఒకటి. ఈ సినిమాను ఇప్పటికి ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారని చెప్పొచ్చు. రాజేంద్ర ప్రసాద్ ఈమధ్య క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. సరైన కథ దొరికితే మీ శ్రేయోభిలాషి సినిమాలు చేయడానికి ఆయన ఎప్పుడు రెడీ అంటున్నారు.                   

మరింత సమాచారం తెలుసుకోండి: