తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని పేరు ఎన్టీఆర్. వారి గుండెల్లో ఆరాధ్య దైవంగా నిలిచిపోయిన కథానాయకుడు ఆయన. ఆయన నట వారసుడిగా వచ్చిన మూడో తరం హీరో.. ఆయన పేరే పెట్టుకున్న నందమూరి తారక రామారావు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ గా వచ్చినా ప్రస్తుతం ఎన్టీఆర్ గా.. తారక్ గా స్థిరపడిపోయాడు. రూపంలోనే కాకుండా నటనలో కూడా తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన తొలి సినిమా ‘నిన్ను చూడాలని’. ఈ సినిమా విడుదలై మే 25కి 19 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

నిజానికి ఎన్టీఆర్ 1997లో రామాయణం ద్వారానే సినిమాల్లో పరిచయమయ్యాడు. పూర్తిస్థాయి హీరోగా మాత్రం నిన్ను చూడాలని సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమా అనే భావనే లేకుండా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ మనవడిగా, నందమూరి హరికృష్ణ తనయుడిగా ఎంట్రీ ఇచ్చినా తన మార్క్ చూపించాడు. ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు వంకినేని రత్న ప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఉపాకిరణ్ మూవీస్ సంస్థ నిర్మించింది. రామోజీరావు నిర్మాతగా ఆయన బ్యానర్ లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకున్నాడు ఎన్టీఆర్.

IHG

 

నిన్ను చూడాలని యావరేజ్ గా నిలిచింది. హీరోయిన్ గా రవీనా రాజ్ పుత్ నటించింది. ఎస్ ఏ రాజ్ కుమార్ సంగీతం అందించారు. మొదటి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా స్టార్ హీరోగా మారడానికి ఎన్టీఆర్ కు కేవలం తొమ్మిది నెలలే టైమ్ పట్టింది. అదే ఏడాది రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెంబర్ వన్’, తర్వాత ఏడాది వినాయక్ తో ‘ఆది’తో స్టార్ హీరో అయిపోయాడు. ఆ తర్వాత ఏడాది వచ్చిన ‘సింహాద్రి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించాడు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: