సీతయ్య... నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన మంచి సినిమాల్లో ఇది కూడా ఒకటి. హరికృష్ణ హీరో గా వచ్చిన ఈ సినిమాను వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తీసుకొచ్చారు. హరికృష్ణ సినిమాల్లో ఈ సినిమా ది బెస్ట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సీన్ లు అయితే ప్రేక్షకులను కట్టిపడేశాయి అని చెప్పవచ్చు. ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులను అలా కూర్చుని చూసే విధంగా చేసింది. ఈ సినిమాను ఇప్పటికి టీవీ లో వచ్చినా సరే ప్రేక్షకులు కచ్చితంగా చూసే విధంగా ఉంటుంది అనేది వాస్తవం. ఈ సినిమా తర్వాత కొన్ని డైలాగులు ఇంకా వినిపించాయి. 

 

సీతయ్య ఎవరి మాట వినడు అంటూ ఉన్న కొన్ని  డైలాగులు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి అనేది వాస్తవం. ఈ సినిమా ఎన్నో రికార్డులను కూడా బద్దలు కొట్టింది. ప్రతీ సీన్ కూడా ఒక రేంజ్ లో ఉందని విమర్శకులు కూడా అన్నారు అంటే ఆ సినిమా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమా ద్వారా ఫ్యాక్షన్ ని ఎదుర్కోవడానికి ఒక పోలీస్ ఏ విధంగా వ్యవహరించాలి అనేది చూపించారు. అదే విధంగా ఫ్యాక్షన్ లో మార్పు తీసుకుని రావాలి అంటే... కొన్ని కొన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది ఈ సినిమాలో చూపించారు. 

 

ఏ హింస లేకుండా ఫ్త్యాక్షన్ ని మాటల ద్వారా నిలిపి వేయవచ్చు అనేది చూపించారు. ఇక భార్య మీద ఒక భర్తకు ఏ స్థాయిలో ప్రేమ ఉండాలి అనేది కూడా చూపించారు. అలా ఆ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి.  కాగా హరికృష్ణసినిమా తర్వాత పెద్దగా సినిమాలు కూడా చేయలేదు. ఆయన కెరీర్ లో  ఆ సినిమా ది బెస్ట్ అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: