మలయాళ సూపర్ హిట్ సినిమాలు డ్రైవింగ్  లైసెన్స్ , అయ్యప్పనుమ్ కోషియం సినిమాలు ఇతర భాషల్లో కి రీమేక్ కానున్నాయి. వీటి హక్కులకు ఫుల్ డిమాండ్ వుంది. ఈరెండు సినిమాల తెలుగు హక్కులు ఇప్పటికే అమ్ముడయ్యాయి..అందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ సొంతం చేసుకోగా అయ్యప్పనుమ్ కోషియం హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం పట్టేలానే వుంది కానీ త్వరలోనే  అయ్యప్పనుమ్ కోషియం  రీమేక్ ప్రారంభం కానుంది. ఇందులో  హీరోలు గా వెంకటేష్ , రానా నటించే అవకాశాలు వున్నాయి. త్వరలోనే ఈసినిమా  గురించి అధికారిక ప్రకటన వెలుబడనుంది. 
 
అటు తమిళం లో కూడా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్  కానుంది. ఈచిత్రంలో ఓ హీరో గా విజయ్ సేతుపతి నటించనుండగా మరో హీరో కోసం వెతుకుతున్నారు. ఇక అయ్యప్పనుమ్ కోషియం హిందీలోనూ రీమేక్ కానుంది. ఈ రీమేక్  హక్కులను బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం దక్కించుకున్నాడు.  జేబీ ఎంటర్టైన్మెంట్స్  ఈసినిమా ను నిర్మించనుండగా  అందులో జాన్ అబ్రహం ఓ హీరోగా నటించనున్నాడు. 
 ఇదిలావుంటే ఒరిజినల్ వెర్షన్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ , బిజూ మీనన్ టైటిల్ లో రోల్ లో నటించగా  ఫిబ్రవరి లో విడుదలైన ఈ చిత్రం 60కోట్ల వసూళ్లను రాబట్టి సంచనల విజయం సాధించింది.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: