మన తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ కు ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చింది అనేది అందరికి తెలిసిందే. అతని తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు ఆసక్తి అప్పటి నుంచి ఎక్కువగా చూస్తున్నారు. అయినా సరే అతను మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను ఒక సినిమా విషయంలో అతి చేసాడు అనే ఆరోపణలు కూడా ఎక్కువగా వచ్చాయి. కాని అది నిజం కాదని తర్వాత తెలిసింది. ఇక ఇప్పుడు అతని తో సినిమా చేయడానికి స్టార్ దర్శకుడు ముందుకు వచ్చినట్టు సమాచారం. 

 

విజయ్ తో సినిమా చేయడానికి గానూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓకే చెప్పాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్రివిక్రమ్ సినిమా చేయడానికి ఇప్పటికే ఓకే చెప్పినట్టు టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా లేట్ అవ్వడం తో ఎన్టీఆర్ ఇప్పట్లో త్రివిక్రమ్ కి దొరికే అవకాశాలు దాదాపుగా లేవు అనే చెప్పాలి. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ చిన్న హీరో తో ఒక సినిమాను ఈ గ్యాప్ లో చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా కథ కూడా అతని వద్ద రెడీ గ ఉంది. ముందు నానీ తో సినిమా చెయ్యాలని భావించాడు. 

 

కాని నానీ కి కుదరకపోవడం తో ఇప్పుడు విజయ్ తో సినిమా చేయడానికి గానూ ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి. ప్రస్తుతం విజయ్ పూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన లాక్ డౌన్ కారణంగా వాయిదా అపడింది 

మరింత సమాచారం తెలుసుకోండి: