టాలీవుడ్ లో ఇప్పుడు వరుసగా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నా సరే కరోన కారణంగా అవి అన్నీ కూడా వాయిదా పడ్డాయి. ఒక్క సినిమా కూడా విడుదల అయ్యే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. అందుకే అగ్ర హీరోలు అందరూ కూడా తమ సినిమాల విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచన చేస్తున్నారు. అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా దాదాపుగా షూటింగ్ ని పూర్తి కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ తరుణంలో సినిమాల విడుదల విషయంలో అనుసరించే వ్యూహం విషయంలో ఆలోచనలో పడ్డారని సమాచారం. 

 

ఇప్పుడు దసరా నుంచి సినిమాల విడుదలకు ఓకే చెప్పారు అంటే ముందు ఎవరి సినిమా విడుదల చెయ్యాలి అనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు అనగానే క్రేజ్ ఉంటుంది కాబట్టి అందరి సినిమాలు ఒక సారి విడుదల చేస్తే ఉపయోగం ఉండదు. అలా అని ఇద్దరు హీరోల సినిమాలు ఒకసారి విడుదల చేసినా సరే భారిగా జనాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే దసరా తర్వాతి నుంచి నెల రోజుల పాటు గ్యాప్ తీసుకుని సినిమాలను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆచార్య సినిమా విడుదల అవుతుంది. 

 

ఆ తర్వాత నాగ చైతన్య సినిమా ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఆ తర్వాత నానీ సినిమా. ఒక పెద్ద హీరో సినిమా ఒక చిన్న హీరో సినిమా. ఇలా జాగ్రత్తగా సినిమాలను విడుదల చేసి జనాలను ఇబ్బంది పెట్టవద్దు అని హీరోలు భావిస్తున్నారు. ప్రభుత్వాలకు కూడా ఇదే విషయాన్ని చెప్పే అవకాశం ఉందని టాలీవుడ్ లో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. మరి ఏ సినిమాలను ముందు విడుదల చేస్తారు అనేది చూడాలి, ఏది చేసినా నష్టాలు ఖాయమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: