టాలీవుడ్ లో ఇప్పుడు అగ్ర హీరోలతో సినిమాలు చెయ్యాలి అంటేనే నిర్మాతలు భయపడిపోయే పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. వారి పేరు వింటే చాలు నిర్మాతలు భయపడుతున్నారు. ఇక ఈ తరుణంలో స్టార్ హీరోలు కూడా నిర్మాతల పరిస్థితిని అర్ధం చేసుకుని సినిమాలను చేసే విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచన చేస్తున్నారు. అగ్ర హీరో అయినా చిన్న హీరో అయినా సరే ఇప్పుడు కథల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత౦ మన తెలుగులో నాలుగు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. 

 

ఇక ఈ తరుణంలో చిరంజీవి మెగా హీరోలకు కీలక సూచనలు చేసినట్టు సమాచారం. టాలీవుడ్ లో ఇప్పుడు పరిస్థితి బాగా లేదని కాబట్టి దర్శక నిర్మాతలను అర్ధం చేసుకుని సినిమాలను చేయడం చాలా మంచిది అని ఎవరి మీద కూడా ఒత్తిడి అనేది తీసుకుని రావొద్దు అని ఆయన సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఏ నిర్మాత అయినా సరే ఇప్పుడు బాగుంటేనే పరిస్థితి బాగుంటుంది అని కాబట్టి అర్ధం చేసుకోవాలని భారీ బడ్జెట్ తో ఏ ఒక్క హీరో కూడా సినిమాలను చేయవద్దు అని చిరంజీవి స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. 

 

దీనితో హీరోలు కూడా ఇప్పుడు సినిమాలను చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అనవసర్మగా సమయం వృధా చేసుకోవద్దు అని ఆయన సూచనలు చేసినట్టు సమాచారం. అటు పవన్ కళ్యాణ్ కి కూడా ఆయన కొన్ని సూచనలు చేసారని పవన్ కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన సినిమాలకు సంబంధించి భారీగా ఖర్చు చేయవద్దు అని నిర్మాతలకు స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. అందుకే ఆయన తో సినిమా చేసే నిర్మాతలు వెనక్కు తగ్గారట. మరి చూడాలి ఎం జరుగుతుందో

మరింత సమాచారం తెలుసుకోండి: