అనిల్ రావిపూడి కి ఒక కోరిక ఉంది. బాలక్రిష్ణను డైరెక్ట్ చేయాలని, నిజానికి అనిల్ రావిపూడిని డైరెక్టర్ని చేసింది కూడా నందమూరి ఫ్యామిలీయే. కళ్యాణ్ రాం తన సొంత బ్యానర్లో పటాస్ మూవీ ద్వారా అనిల్ రావిపూడిని పరిచయం చేశారు. ఆ తరువాత టాలెంట్ బయటకు వచ్చి అనిల్ పెద్ద డైరెక్టర్  అయ్యాడు.

 

ఎంతటి స్థాయి అంటే సరిలేరు నీకెవ్వరూ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని మహేష్ బాబుకు అనిల్ సంక్రాంతికి ఇచ్చాడు. అంతకు ముందు సీనియర్ హీరో వెంకటేష్ తో వరుణ్ తేజ్ ని కలిపి బ్లాక్ బస్టర్ మూవీగా ఎఫ్ 2 తీశారు. ఇపుడు అదే కాంబోతో ఎఫ్ 3 మూవీ తీస్తున్నారు. దీని తరువాత అనిల్ మళ్ళీ బాలయ్య తోనే మూవీ చేస్తారట.

 

లాక్ డౌన్ పీరియడ్ ని బాగా ఉపయోగించుకుంటున్న అనిల్ బాలయ్యకు అదిరిపోయే కధను రెడీ చేశారని అంటున్నారు. ఈ కధను బాలయ్యతో ఒకే చేయించుకుంటే ఇక ఈ కాంబో సెట్ అయినట్లే. ఇప్పటికే బాలయ్య అనిల్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. నిజానికి రామారావు అన్న మూవీని అనిల్ రావిపూడి బాలయ్యతో చేయాలి. 

 

మరిపుడు ఆ కధకే మెరుగులు  పెట్టి కొత్తగా బాలయ్యను చూపించబోతున్నారా లేక మరే కధ అయినా  రెడీ చేసి పెట్టుకున్నారా అన్నది చూడాలి. ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి తో బాలయ్య మూవీ అంటే ఫ్యాన్స్ కూడా హుషార్ చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోలో బంపర్ హిట్ సినిమా వస్తుందని కూడా గట్టిగా నమ్ముతున్నారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే అనిల్ రావిపూడి మహేష్ బాబుకు కూడా మరో బాకీ ఉన్నాడట. బాలయ్య సినిమా అయిపోగానే మళ్ళీ మహేష్ తో కూడా సినిమా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఒకసారి బాలయ్యతో కనుక కుదురుకుని పెద్ద  హిట్ ఇస్తే మాత్రం ఈ కాంబో మళ్ళీ మళ్లీ రిపీట్ అవకతప్పదని కూడా ఫ్యాన్స్ అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: