మనిషి జీవితంలో తల్లి మీద ఉండే ప్రేమ ఒకెత్తయితే తండ్రితో ఉండే ప్రేమ మరొక ఎత్తు. వేలు పట్టుకుని బుడి బుడి అడుగులు నేర్పించడం నుంచీ విద్యా బుద్ధులు చెప్పించి ప్రయోజకుడ్ని చేయడంలో తండ్రి పాత్ర ఎంతో ముఖ్యమైంది. తన జీవితంలో కూడా తండ్రి పాత్ర ఎంతో ఉదాత్తమైనదని చెప్తున్నాడు బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన విలాస్ రావ్ దేశ్ ముఖ్ 75వ జయంతి నేడు. ఈ సందర్భంగా విలాస్ రావ్ తనయుడు రితేశ్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

 

 

తండ్రి జ్ఞాపకాల్ని రితేశ్ తలచుకున్న తీరు అందరి గుండెల్ని పిండేస్తోంది. ఇంట్లో తండ్రి గుర్తుగా ఆయన దుస్తులు దాచుకున్నాడు రితేశ్. అందులోని కుర్తా స్లీవ్ లో రితేశ్ కుడి చేయి వేసుకుని తండ్రే తనను కౌగిలించుకున్నట్టు ఫీలయ్యాడు. ఈ వీడియోలో రితేశ్ తంద్రి కుర్తాను కౌగిలించుకుని తన కుడి చేత్తో ఎడమ భుజంపై ధైర్యం చెప్పుకోవడం చూస్తుంటే నిజంగా విలాస్ రావ్ కొడుకును కౌగిలించుకుని ధైర్యం చెప్తున్నట్టు ఉంది. ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ లో 2012లో వచ్చిన అగ్నిపథ్ సినిమాలోని పాటను జోడించాడు. రితేశ్ ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

 

 

'హ్యీపీ బర్త్ డే పాపా.. మిస్ యూ ఎవిరీ డే' అని రాసుకున్నాడు. వీడియోలో రితేశ్ ను చూసిన ఎవరికైనా కళ్లు చెమర్చుతాయి. తండ్రిపై ప్రేమను చాటుకున్న రితేశ్ కు పలువురు సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కూడా భారీగా స్పందిస్తున్నారు. భార్య జెనీలియా కూడా ‘మీరెప్పుడూ మాతోనే ఉంటారు.. మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు’ అంటూ భావోద్వేగమైంది. టాలీవుడ్ నుంచి మంచు లక్ష్మీ, దేవీశ్రీ ప్రసాద్ రితేశ్ కు రిప్లై ఇచ్చారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: