టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న బడా నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. తాను నిర్మించిన 'దిల్' సినిమాతో 'దిల్ రాజు'గా మారిపోయిన వెంకట రమణారెడ్డి టాలీవుడ్‌ లో తిరుగులేని నిర్మాతగా కొనసాగుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఏర్పాటు చేసి వరుస చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటున్నాడు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వెంకట రమణా రెడ్డి ఆ తర్వాత రోజుల్లో ప్రొడ్యూసర్ గా మారి సినిమాలను నిర్మించడం స్టార్ట్ చేసాడు. దిల్ రాజు సారధ్యంలో సంవత్సరానికి కనీసం ఐదు నుంచి ఆరు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. సక్సెస్‌ ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దిల్ రాజు తనకు నచ్చిన ఇతర భాషల్లోని సినిమాలను కూడా తెలుగులో రీమేక్ చేస్తుంటారు. అలానే మన తెలుగు సినిమాలను కూడా ఇతర భాషల్లో రీమేక్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హిందీలో కూడా సినిమాలు నిర్మిస్తున్నారు దిల్ రాజు. ఆయన నిర్మాణంలో గతేడాది రిలీజై వంద కోట్ల క్లబ్ లో చేరిన ‘ఎఫ్ 2’ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నాడని సమాచారం.

 

అంతేకాకుండా నాని ‘జెర్సీ’ సినిమాని కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు అందించేందుకు ఇప్పటికే అక్కడ దిల్ రాజు నిర్మాణం స్టార్ట్ చేసారు. తాజాగా దిల్ రాజు మరో సినిమాని బాలీవుడ్‌ లో నిర్మించేందుకు హీరో నాని దగ్గర నుంచి రైట్స్ తీసుకున్నారట. హీరో నాని నుంచి రైట్స్ పొందడం ఏమిటి అని అనుకుంటున్నారా? నాని కూడా ఈ మధ్య నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడనే విషయం తెలిసిందే. నాని నిర్మించిన ఓ చిత్రానికి సంబంధించిన రీమేక్ రైట్స్‌ ను దిల్ రాజు పొందినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఏం సినిమా రైట్స్ అనేది చెప్పలేదు కదా.. ఇటీవల వచ్చిన ‘హిట్’ సినిమాని బాలీవుడ్ ప్రేక్షకులకు అందించేందుకు దిల్ రాజు సిద్ధమవుతున్నారు. విశ్వక్ సేన్ - రుహాని శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ 'హిట్' సినిమా మంచి హిట్ అందుకుంది. అందువల్ల ఈ సినిమాని హిందీ ఆడియన్స్ కి చూపించాలని దిల్ రాజు అనుకుంటున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా రీమేక్‌ లో బాలీవుడ్‌లో ఎవరు నటిస్తారనే విషయంపై కూడా అప్పుడే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

 

ఇదిలా ఉండగా దిల్ రాజు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హిందీలో సూపర్ హిట్ అయిన 'పింక్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. 'వకీల్ సాబ్' అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీకపూర్ తో కలిసి నిర్మిస్తున్నారు. మొత్తం మీద సక్సెస్‌ ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దిల్ రాజు ఇప్పుడు స్ట్రైట్ చిత్రాల కంటే రీమేక్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: