టాలీవుడ్ లో రాఘవేంద్ర రావు ఎన్టీఆర్ కాంబినేషన్ అనగానే చాలా మందికి ఇప్పటికి ఒక పిచ్చి. వారి కాంబినేషన్ లో సినిమా అనగానే చాలా మందికి ఇప్పటికి ఎక్కడ లేని ఆసక్తి. సినిమా టీవీ లో వస్తుంది అంటే చాలు ఇప్పటికి కూడా అలా నిలబడి చూస్తూ ఉంటారు. ఎన్టీఆర్ కెరీర్ లో మంచి సినిమాలు చేసిన దర్శకుడిగా ఆయనకు పేరు వచ్చింది. ఎన్టీఆర్ కూడా అక్కడి నుంచి ఆయనను అభిమానించారు అని చెప్పవచ్చు. రాఘవేంద్ర రావు తో సినిమాలు అనగానే ఎన్టీఆర్ అభిమానులు ఏ విధంగా ఎదురు చూసారో అదే విధంగా రాఘవేంద్ర రావు తో సినిమా చేయడానికి ఎన్టీఆర్ కూడా ఎదురు చూసారు. 

 

ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలను రాఘవేంద్ర రావు తో చేసారు. వేటగాడు అడవి రాముడు, మేజర్ చంద్రకాంత్, జస్టీస్ చౌదరి, కొండవీటి సింహం ఇలా ప్రతీ సినిమా కూడా ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ సినిమాలు అన్నీ కూడా అక్కడి నుంచి ఒక రేంజ్ లో ఆడాయి అనేది వాస్తవం. ఎన్టీఆర్ సినిమాల కు పూలు జల్లిన సినిమాలు అన్నీ కూడా. ప్రతీ సినిమా లో ఎన్టీఆర్ జీవించారు. కథ ఎలా ఉన్నా సరే ఎన్టీఆర్ నటిస్తే చాలు అనేది కూడా అక్కడి నుంచే ఎక్కువగా వినపడింది. రాఘవేంద్ర రావు అయితే ఆయన తో సినిమా చేయడానికి వేరే ఆఫర్లు వచ్చినా సరే కాదు అనే వారు అని చెప్తారు. 

 

వసూళ్ళ పరంగా కూడా ఎన్టీఆర్ సినిమా లు అక్కడి నుంచి మరో రేంజ్ కి వెళ్ళాయి అనేది వాస్తవ౦. కథలో పట్టు ఉంటే చాలు ఏ సినిమా అయినా సరే ఎన్టీఆర్ ఉంటే హిట్ అన్నారు ప్రేక్షకులు. అలా ఆకట్టుకున్నాయి వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: