లవ కుశ... ఇప్పుడు టీవీ లో వచ్చినా సరే చూసే సినిమా ఇది. ఎన్టీఆర్ కెరీర్ లో ఎంతో మంచి విజయం సాధించిన సినిమా ఇది. ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులను ఓకే లోకం లోకి తీసుకుని వెళ్ళిన సినిమా ఇది అనేది వాస్తవం. సినిమా అంటే ఇలా ఉండాలని ఆ రోజుల్లోనే చెప్పిన సినిమా ఇది. ఎన్టీఆర్ నటనకు దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ లో ఒక రేంజ్ లో పెరిగింది. ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం కోసం ఆయన సినిమా చేసే సెట్స్ వద్దకు కూడా వెళ్లారట. ఆ రేంజ్ లో ఆ సినిమా ప్రభావం చూపించింది. 

 

పౌరాణిక సినిమాలలో ఆ సినిమా ఒక స్థాయిలో చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ సినిమాలు అనగానే చాలా మంది ప్రేక్షకులు అక్కడి నుంచి ఎదురు చూడటం కూడా మొదలుపెట్టారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన సినిమాలో నటించే అవకాశం వచ్చినా చాలు అనుకున్న నటులు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ తో సినిమా అనగానే హీరోయిన్ లు చాలా మంది గంతులు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటారు. ఎన్టీఆర్ పక్కన ఏ హీరోయిన్ చేసిన సరే చాలా అందంగా చేసే వారు. ఇప్పటి కూడా ఎన్టీఆర్ తో ఉన్న జ్ఞాపకాలను వాళ్ళు గుర్తు చేసుకుంటూ నే ఉంటారు. 

 

ఎక్కువగా ఆ సినిమా తర్వాత కథలో పట్టు కొంచెం తక్కువగా ఉన్నా సరే ఎన్టీఆర్ తో సినిమా చేస్తే కచ్చితం గా హిట్ అవుతుంది అనే భావన కు దర్శక నిర్మాతలు వచ్చి కథలు రాసుకుని తీసుకుని వెళ్ళే వారు. అలా ఆయన వందల సినిమాలకు ప్రాణం పోశారు. దర్శకుడిగా నిర్మాతగా కూడా ఆ సినిమా తర్వాత ఆయన రాణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: