మేజర్ చంద్రకాంత్... ఎన్టీఆర్ సినీ జీవితం చివర్లో ఈ సినిమా ఒక సంచలనం. ఆయన సినిమాల కోసం అభిమానులు పిచ్చి ఏ స్థాయిలో ఎక్కిపోయారో ఈ సినిమా చూపించింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఎన్టీఆర్  ని కల్లో కూడా తలుచుకున్నారు అంటే ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమాలో ఉండే ప్రతీ పాట ప్రతీ నటుడు కూడా ప్రేక్షకులకు ఇంకా గుర్తున్నారు అనేది వాస్తవం. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించలేదు జీవించారు అన్నారు. 

 

ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి కూడా ఈ సినిమా చాలా హెల్ప్ అయింది. ఒక అధికారి అంటే ఏ విధంగా ఉండాలి అనేది ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో ఆయన నటనను బాలీవుడ్ కూడా కొనియాడింది అంటే ఏ స్థాయిలో నటించారో అర్ధం చేసుకోవచ్చు. కొన్ని పాటలకు ప్రేక్షకులు పిచ్చి ఎక్కిపోయారు అనేది వాస్తవం. ప్రతీ పాట కూడా చిరస్థాయిలో నిలిచింది. ఒక అధికారిలో ఉండే దమ్ము కుటుంబం మీద ప్రేమ అన్నీ కూడా ప్రత్యేకంగా ఈ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఇక్కడ నుంచి ఎన్టీఆర్ సినిమా మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని చూసారు. 

 

కాని ఆ తర్వాత ఆయన సినిమాలు చేయలేదు ఆ సినిమాలో ఆయన నటను అవార్డులు చాలానే వచ్చాయి. వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది అప్పట్లో అనేది వాస్తవం. ఇక నిర్మాతకు లాభాల పంట పండింది. ప్రతీ నిర్మాత కూడా ఆయనతో సినిమా చేయలేదే అని భాదపడే విధంగా ఆ సినిమా విజ్డయం సాధించింది. ఇక రాఘవేంద్ర రావు కి కూడా ఆ సినిమా తర్వాత ఎక్కడ లేని పేరు వచ్చి పడింది. ఆయన కూడా ఇప్పటికి చెప్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: