తలైవర్ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఎలాంటి క్రేజ్ ఉందో సౌత్ మొత్తం తెలిసిందే. ఆయన సినిమాలకి ఉన్న క్రేజ్ చెప్పాలంటే తమిళ సినిమాలలో మరే హీరోకి లేదని చెప్పొచ్చు. కాని అది ఏరోజు సూపర్ స్టార్ గ్రేట్ గా ఫీలవకపోవడం గొప్ప విషయం. కబాలి.. కాలా.. రోబో.. పేట..దర్బార్ ...ఇవన్ని కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ బడ్జెట్ సినిమాలు. ఈ సినిమాలు ఫ్లాపయినప్పటికి రజనీకాంత్ క్రేజ్ గాని ఆయన రెమ్యూనరేషన్ గాని ఏమాత్రం తగ్గడం లేదు. 

 

ఇంత భారీ సినిమాలు కోలీవుడ్ లో సూర్య, విజయ్, అజిత్ లు కూడా చేయడం లేదు. అంతేకాదు ఇంత స్పీడ్ గా ఏ హీరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఈ వయసులో కూడా రజనీకాంత్ తన సత్తా చాటుతున్నాడంటే ఆయన మ్యానియా ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రజనీకాంత్ రీసెంట్ సినిమా దర్బార్ భారీగా నష్ఠాలను తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. అయినా రజనీకాంత్ స్పీడ్ కంటిన్యూ అవుతూనే ఉంది.

 

ప్రస్తుతం ఒక సినిమా సెట్స్ మీదకి తెచ్చారు. తెలుగు వాడైనా శివ తమిళ ఇండస్ట్రీలో వరసగా అజిత్ తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చాడు. మాస్ కథాంశంతో శివ వరసగా సక్సస్ లను అందుకుంటున్నాడు. ఈ దర్శకుడి ట్రాక్ రికార్డ్ చూసే రజనీకాంత్ శివ కి ఛాన్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్, సీనియర్ హీరోయిన్ మీనా నటిస్తున్న సంగతి తెలిసందే. 

 

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి అలనాటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ వచ్చి చేరబోతుంది. అయితే సినిమాలు ఫ్లాపవుతూన్నా తన సినిమాలో భారీ స్టార్ కాస్టింగ్ ఉండేలా మాత్రం హంగులను అద్దుతున్నారు రజనీకాంత్. గత సినిమాలలో కూడా రాధికా ఆప్టే, ధన్సిక, సిమ్రాన్, నయన తార, నివేదా థామస్ లాంటి వాళ్ళను నటింపజేశారు. ఇప్పుడు కూడా అదే పంథాలో వెళుతున్నారు. అయితే రజనీకాంత్ సినిమాల విషయంలో గాని, బడ్జెట్ విషయం లో గాని ..మరే విషయాలలో సూపర్ స్టార్ కి పోటీలేకపోవడం గమనర్హం.  

మరింత సమాచారం తెలుసుకోండి: