మీడియా టైకూన్ అని ఆయనకే పేరు చెల్లింది. ఎందరు ముందున్నా తరువాత ఎందరు వచ్చినా కూడా ఆయనే ఆ పేరు సార్ధకం చేసుకున్నారు. ఓ విధంగా తెలుగు మీడియా రంగాన్ని మలుపు తిప్పిన చరిత్ర ఆయన సొంతం. ఆయన ఆనాడూ ఈనాడూ, ఏనాడూ కూడా ఈనాడే. ఆయన నవనవోన్మేషణమే. 

 

ఆయనే రామోజీరావు. ఇక  రామోజీరావులో ఎన్నో అభిరుచులు ఉన్నాయి. ఆయన 80 దశకంలో సినిమాలు తీశారు. వరసగా సినిమాలు తీసి హిట్లు కూడా కొంటారు. వైవిధ్య‌మైన కధలను వెండితెర మీద ప్రెజెంట్ చేయడంలో రామోజీకి సాటి ఎవరూ లేరు. ఆయన ఉషాకిరణ్ బ్యానర్ స్థాపించి తొలిసారిగా శ్రీవారికి ప్రేమలేఖ మూవీని తీసి సూపర్ హిట్ కొట్టారు. ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తే అంతా చాలా ఆసక్తిగా చూస్తారు. 

 

ఆ తరువాత ప్రతిఘటన. మయూరి వంటి సినిమాలు తీసి వాస్తవైక జీవిత చిత్రాలను కూడా సినిమాలుగా ఎలా తీయవచ్చో అందరికీ చూపించారు. ఇక 2000లో చిత్రం సినిమా తీసి యూత్ ని కట్టిపడేశారు. ఆ తరువాత కొన్ని హిట్లు వచ్చినా కూడా ఎక్కువ ఫ్లాప్స్ రావడంతో రామోజీరావు సినిమాలకు 2015లో స్వస్తి చెప్పారు. మళ్ళీ అయిదేళ్ల తరువాత ఇపుడు ఆయన సినిమాల వైపు చూస్తున్నారుట.

 

సినిమాలు తీయాలని ఆయన ఆలోచన చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇపుడు లాక్ డౌన్, మరోవైపు కరోనా మహమ్మారితో సినిమా బొమ్మ తిరగబడి ఉంది. ఈ పరిస్థితుల్లో రెగ్యులర్ నిర్మాతలే చేతులెత్తేస్తున్న వాతావరణం ఉంది. కానీ రామోజీరావు మాత్రం ఇటువంటి సమయంలో సినిమాలు తీస్తానని ఆలోచన చేయడం విశేషమేనని అంటున్నారు.

 

మరి చూడాలి రామోజీరావు సినిమాలు ఏ విధంగా ఈనాటి తరాన్ని ఆకట్టుకుంటాయో. ఏది ఏమైనా రామోజీరావు వంటి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్ సినిమాల వైపు చూస్తే మంచి సినిమాలు వస్తాయనడంతో సందేహం. లేదు. అలాగే కొత్త కధలు కూడా తెలుగు తెరకు పరిచయం చేస్తారని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: