షూటింగ్స్ ఎపుడు మొదలవుతాయి అనేది ఎవరికీ క్లారిటీ లేదు గానీ.. బిగ్ బాస్ మాత్రం అప్పుడే వేట మొదలుపెట్టేశాడు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ప్రపంచమంతా చెబుతుంటే.. ఈ రియాలిటీ కింగ్ మాత్రం సెలబ్రెటీస్ అందరినీ ఓ ఇంట్లో బంధించేందుకు సిద్ధమైపోయాడు. ఇప్పటికే ఇద్దరు పార్టిసిపెంట్స్ ఓకే అయినట్టు సమాచారం. 


తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో రేటింగ్ ల పండుగ చేసుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ గేమ్ షో ఇప్పుడు నాలుగో సీజన్ కు రెడీ అవుతోంది. హౌస్ లో అడుగుపెట్టే సెలబ్రెటీస్ కోసం వెతుకుతోంది. ముఖ్యంగా గ్లామర్ షోకు గ్లామర్ యాడ్ చేసే బ్యూటీస్ కోసం సెర్చ్ చేస్తున్నారు. 

 

స్కిన్ షోతో కుర్రాళ్ల మతులు పోగొట్టాలని ఎంతగానో ట్రై చేసి, పనవ్వక సైడ్ అయిపోయిన హీరోయిన్ శ్రద్ధాదాస్. హీరోయిన్ గా కెరీర్ స్టార్ చేసి, సపోర్టింగ్ రోల్స్ లోనూ బిజీ కాలేకపోయిన ఈ బ్యూటీని బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించారనీ.. సీజన్-4కి అగ్రిమెంట్ చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. 


సిల్వర్ స్క్రీన్ నుంచి స్మాల్ స్క్రీన్ కు వచ్చిన హాట్ యాంకర్ వర్షిణిని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించారనే టాక్ వస్తోంది. బిగ్ బాస్ తో కెరీర్ కు బూస్టప్ వస్తుందనే ఆశతో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెడుతోందట వర్షిణి. అయితే జనరల్ గా బిగ్ బాస్ ప్రతీ ఏడాది జులైలో స్టార్ అవుతుంది. కానీ లాక్ డౌన్ తో షట్ డౌన్ అయిన ఇండస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియడం లేదు.


అయితే పర్మీషన్స్ వచ్చిన వెంటనే షో స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట బిగ్ బాస్ నిర్వహకులు. అందుకే ఇప్పటి నుంచే సెలబ్రెటీల కాల్షీట్స్ తీసుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: