రాజమౌళితో మహేష్ బాబు సినిమా ఉంటుందని చెప్పగానే మహేష్ అభిమానుల్లో ఆనందం ఉప్పొంగింది. ఎప్పటి నుండో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని వస్తున్న వార్తలు నిజమవుతాయని హామీ రావడంతో ఒక్కసారిగా ఉత్సాహానికి లోనయ్యారు. అయితే మగధీర, బాహుబలి, ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్, వంటి చిత్రాలని తెరకెక్కించిన రాజమౌళి మహేష్ బాబుని ఎలా చూపించబోతున్నాడనేది అందరికీ ఆసక్తిగా మారింది.

 

 

అయితే ఆర్.ఆర్.ఆర్ లాంచింగ్ ప్రోగ్రామ్ లో రాజమౌళి ఒక మాట అన్నాడు. మహేష్ బాబుతో సినిమా చేయాలంటే జేమ్స్ బాండ్ తరహా చిత్రం చేయాలని. అందువల్ల చాలా మంది మహేష్ బాబుతో చేసే చిత్రం యాక్షన్ థ్రిల్లర్ అయ్యుంటుందని భావిస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం మహేషే బాబు పురాణ ఇతిహాస గాథలలోని పాత్రల్లో చూడాలని అనుకుంటున్నారు. మహేష్ బాబు ఇప్పటి వరకూ అలా కనిపించలేదు.

 

 

రాజమౌళి సోషియో ఫాంటసీ సినిమాలు తీయడంలో దిట్ట. అందుకే మహేష్ బాబుని అలాంటి పాత్రల్లో చూడాలని కోరుకుంటున్నారు. ఈ  మేరకు తమ రిక్వెస్ట్ ని ఫ్యాన్ మేడ్ పోస్టర్ల రూపంలో బయటకి వెళ్లగక్కుతున్నారు. మహేష్ బాబు రాముడిగా చేతిలో బాణం పట్టుకుని ఉన్న పోస్టర్ ని క్రియేట్ చేసిన అభిమానులు తామెలా చూడాలనుకుంటున్నామో చెప్పేశారు. ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

 

 


మరి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాదో చూడాలి. టాలీవుడ్ హీరోలందరూ పాన్ ఇండియా రేసులో ముందుకెళ్తుంటే మహేష్ బాబు పాన్ ఇండియా చిత్రం రాజమౌళితో మొదలవనుంది. ప్రస్తుతం రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: