మన తెలుగులో ఇప్పుడు ఇతర భాషల సినిమాల మీద ప్రేమ అనేది ఎక్కువైన విషయం తెలిసిందే. ఇత‌ర భాష‌ల్లో రిలీజ్ అయిన సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల రీమేక్ రైట్స్ కొని మ‌రీ ఆ సినిమాల‌ను ఇక్క‌డ రీమేక్ చేసి హిట్లు కొడుతున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు ఈ లిస్టులో ముందు వ‌రుస‌లోనే ఉంటారు. ఇదిలా ఉంటే చిన్న చిన్న హీరోలు కూడా ఇప్పుడు ఇతర భాషల సినిమాల మీద ఎక్కువగా దృష్టిపెడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇక అగ్ర హీరోలు అయితే నిర్మాతలు గా మారే అవకాశం ఉందని అంటున్నారు. టాలీవుడ్ లో చాలా మంది  హీరోలు ఆదాయ మార్గాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారట.



ఇది పక్కన పెడితే... ఇప్పుడు కేజిఎఫ్ సీక్వెల్‌ సినిమా తెలుగు భాష పంపిణీ హక్కుల కోసం రామ్ చరణ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. రెండు మూడు సార్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అతను మాట్లాడినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిజం ఎంత అనేది తెలియదు గాని త్వరలోనే దీనిపై ఒక వార్త వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఆ సినిమాను దాదాపు రు. 30 కోట్లకు తెలుగులో కొనే ప్రయత్నం చేస్తున్నాడట. కేజీఎఫ్ తొలి సినిమా అన్ని భాష‌ల్లోనూ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది.



అయితే ఆ సినిమా నిర్మాతలు మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచన చేసి చెప్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. రామ్ చరణ్ నిర్మాతలతో చర్చించినా సరే వారి నుంచి సరైన స్పందన రాలేదని కూడా కొందరు అంటున్నారు. అగ్ర హీరోల సినిమాల కు మించి ఇప్పుడు ఆ సినిమాకు క్రేజ్ వచ్చింది. ఇండియన్ సినిమాలో ఆ సినిమా ఒక సంచలనం అనేది వాస్తవం. అందుకే అన్ని భాషల్లో ఆ సినిమాకు క్రేజ్ అనేది వచ్చింది. అందుకే ఇప్పుడు కేజీఎఫ్ 2 రైట్స్ కోసం భారీ అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: