టాలీవుడ్ లో ఇతర భాషల నటుల మీద గట్టిగ కన్నేశారు స్టార్ హీరోలు అనేది వాస్తవం. ఇతర భాషల హీరోలతో సినిమాలు చేసి హిట్ కొట్టి వారి భాషల్లో మార్కెట్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు మన తెలుగులో కొందరు తమిళ హీరోలకు మంచి క్రేజ్ అనేది వచ్చింది. ఈ లిస్టులో ఎప్ప‌టి నుంచో ఉన్న ర‌జ‌నీ కాంత్‌, క‌మ‌ల్ హాస‌న్ నుంచి కార్తీ, సూర్య‌, విశాల్‌, విక్ర‌మ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. ఇక ఇప్పుడు మ‌రి కొంద‌రు యువ త‌మిళ హీరోలు సైతం ఇక్క‌డ మార్కెట్ పెంచుకునేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

 

 అందులో ప్రధానంగా చెప్పుకునే హీరో విజయ్ సేతుపతి. అతని సినిమాలను ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సైరా సినిమాలో అతని పాత్ర ఉండేది కొంచెం సేపే అయినా సరే ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది కూడా. ఇప్పుడు అతనికి మరిన్ని ఆఫర్లు మన తెలుగులో భారీగా వస్తున్నాయి. అయితే అతను ఇదే ఛాన్స్ అని చెప్పి... కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తాము క‌రోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇప్పటికే నష్టాల్లో ఉన్నామని చిన్న పాత్రకు కూడా కోట్లు అంటే తమ వల్ల కాదని నిర్మాతలు చెప్పినట్టు సమాచారం. 

 

ఇక విజయ్ సేతుపతిని తమ సినిమాల్లోకి తీసుకోవడానికి అగ్ర హీరోలు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ తన సినిమా పుష్ప లో అతని కోసం ప్రయత్నాలు చేసినా సరే అది సాధ్యం కాలేదు. మరో విలన్ ని తీసుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో విలన్ గా అతన్ని తీసుకునే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. విజ‌య్ సేతుప‌తి కి తెలుగు లో కూడా క్రేజ్ ఉన్న మాట వాస్త‌వ‌మే అయినా మ‌రీ ఈ రేంజ్‌లో డిమాండ్ చేయ‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు. మ‌రి విజ‌య్ త‌గ్గుతాడా ?  లేదా ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: